
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ సెరామిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఎంట్రీ ఇచ్చింది. 'సిగ్నేచర్ ఎడిషన్' పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్ ను తీసుకొస్తోంది. అత్యంత ఖరీదైన ప్రీమియం మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ డివైస్ ధర కూడా అంతే ఖరీదైనదిగా ఉంది. సుమారు రూ.1,18,800గా ఉండనుంది. జిర్కోనియం సెరామిక్ బ్యాక్ కవర్ పై ఎలాంటి ఎలాంటి గీతలు పడవట. ఇది ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కూడా. అంతేకాదు ఈ డివైస్ బ్యాక్ కవర్‌పై ఔత్సాహిక కస్టమర్లు తమ సిగ్నేచర్‌ను ఎన్‌గ్రేవ్ చేయించుకోవచ్చు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే... వైర్‌లెస్ చార్జర్, రెండు పవర్ ఫుల్ రియర్ కెమెరాలతో ఇది లభ్యం కానుంది. ప్రారంభ కొనుగోలుదారులు ఆకర్షించడానికిఎల్‌జీ కేవలం 300 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అయితే షావోమి ఆల్ సెరామిక్ వెర్షన్‌లో ఎంఐ మిక్స్ 2 , వచ్చే వారం ఇండియాలోకి రానున్న వన్ ప్లస్ 5టి స్టార్ వార్స్ ఎడిషన్ కూడా సెరామిక్ బిల్డ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడలే.
ఎల్‌జీ సిగ్నేచర్ ఎడిషన్ ఫీచర్లు
6 ఇంచ్ భారీ ఫుల్ విజన్ డిస్‌ప్లే
1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,
6 జీబీ ర్యామ్
256 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా,
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment