ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు | Now, a TV from LG that can keep mosquitoes away | Sakshi
Sakshi News home page

ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు

Published Wed, Jun 8 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు

ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ ఎల్‌జీ తాజాగా ‘మస్కిటో అవే టీవీ’ (దోమల్ని తరిమివేసే టీవీ)ని మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర శ్రేణి రూ.26,900-రూ.47,500గా ఉంది. ఈ టీవీలో అల్ట్రా సోనిక్ పరికరాన్ని అమర్చామని, ఇది ధ్వని తరంగ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుందని, ఈ టెక్నాలజీ దోమల్ని బయటకు పారదోలుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా పేర్కొంది.

ఇందులో ఎలాంటి రసాయనాలను ఉపయోగించలేదని, ఈ టీ వీలు మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయదని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే టీవీల తయారీ జరిగిందని పేర్కొంది. ‘మస్కిటో అవే టీవీ’లు ఎంపిక చేసిన ఎల్‌జీ బ్రాండ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement