ఆండ్రాయిడ్ నోగట్తో ఎల్జీ ఫోన్ వచ్చేసింది!
ఆండ్రాయిడ్ నోగట్తో ఎల్జీ ఫోన్ వచ్చేసింది!
Published Wed, Sep 7 2016 9:15 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షెన్ 7.0 నోగట్ సాప్ట్వేర్తో తొలి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ, వీ20 పేరుతో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. శాన్ఫ్రాన్సిస్కో ఈవెంట్గా ఈ ఫోన్ను ఎల్జీ లాంచ్ చేసింది. నోగట్ ఇప్పటికే ఉచిత అప్గ్రేట్గా నెక్షస్ బ్రాండ్లోని కొన్ని గూగుల్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అయితే నోగట్ మొదట ఇన్స్టాల్ చేసిన ఫోన్ వీ20నే కావడం విశేషం. గతేడాది ప్రవేశపెట్టిన వీ10 విజయవంతం కావడంతో, ఎల్జీ లేటెస్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ సాప్ట్వేర్తో వీ20 ఫోన్ను కంపెనీ తీసుకొచ్చింది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్కి టాప్లో ఉంటుంది. రెండో డిస్ప్లే మొదటి దానికంటే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్తో ఉండనుంది.
కెమెరా సిస్టమ్ను ముందస్తు దానికంటే మరింత సామర్థ్యంతో ఈ మోడల్ను అప్గ్రేడ్ చేశారు. వినియోగదారులు ఎవరైతే ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తుంటారో వారికి ఆకర్షణీయంగా ఉండనుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. అదేవిధంగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ ఫీచర్తో తీసుకొచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్ఫోన్ కూడా తమదేనని ఎల్జీ ప్రకటించింది. మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని కంపెనీ చెప్పింది. గ్లోబల్గా వీ20 ఫోన్ ఈ నెల నుంచి అందుబాటులోకి రానుంది. డార్క్ గ్రే, సిల్వర్, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రెండు వారాల్లో కంపెనీ పూర్తి వివరాలను వెల్లడిచనుంది.
ఎల్జీ వీ20 ఫీచర్లు...
5.7 అంగుళాల క్యూహెచ్డీ మెయిన్ డిస్ప్లేతో రెండో డిస్ప్లే
క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
2 టీబీ వరకు విస్తరణ మెమెరీ
డ్యూయల్ కెమెరాస్(16 ఎంపీ స్టాండర్డ్, 8 ఎంపీ వైడ్-యాంగిల్)
3200 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement