ఎల్జీ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు | LG has introduced its new budget smartphones under the K series - K7 and K10 - in India | Sakshi
Sakshi News home page

ఎల్జీ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు

Published Thu, Apr 14 2016 5:38 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

LG has introduced its new budget smartphones under the K series - K7 and K10 - in India

న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టింది. కె సిరీస్లో భాగంగా కె7, కె10 శ్రేణి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఎల్జీ. ఇండియాలో కె7 ధర రూ.9,500 కాగా.. కె10 ధర రూ.13,500లుగా కంపెనీ నిర్ణయించింది. కె7 ఆండ్రాయిడ్ వర్షన్‌లో 5.1 లాలీపాప్తో పనిచేసే ఈ మొబైల్లో స్టోరేజీ కోసం స్లాట్ ఉంది.  ప్రకృతి రమణీయత కనిపించేలా ఉన్న డిజైన్ను ఈ ఫోన్ల కోసం వినియోగించారు.

కె7 ప్రత్యేకతలు..
5.0 అంగుళాల స్క్రీన్ ఎఫ్డబ్ల్యూవీజీఏ(854X480)
1.3 జీహెచ్జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
5 మెగా పిక్సళ్ల ఫ్రంట్, రీర్ కెమెరాలు
1 జీబీ ర్యామ్
2,125 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ
ఫ్లాష్

కె10 ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1తో నడిచే ఈ మొబైల్లో స్టోరేజీ సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైన స్లాట్ను ఏర్పాటు చేశారు.
5.3 అంగుళాల స్క్రీన్తో ఫుల్ హెచ్డీ(1280x720)
స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రాసెసర్
2జీబీ ర్యామ్
13 మెగా పిక్సల్ రీర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ఫ్లాష్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement