భారత వినియోగదారులకు చౌకగా 4జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ఇక ఎల్ జీ కూడా రేసులో నిలబడింది. అది కూడా పూర్తిగా మేక్ ఇన్ ఇండియాలో భాగమై వాటికి రూపకల్పన చేసింది. ఎల్జీ కే7, కే10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను రూ.9,500, రూ.13,500లకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ దిగ్గజం ఏడాదిలో ఒక మిలియన్ హ్యాండ్ సెట్ లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఈ ఫోన్లను సీఈఎస్ 2016 ట్రేడ్ షోలో కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ విడుదల చేశారు. భారత్ లో ఎలక్ట్రానిక్ బూమ్ కు చాలా అవకాశముందని..కొత్త పాలసీలను, కొత్త పథకాలను భారత్ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని మంత్రి తెలిపారు. నిగనిగలాడే గులకరాయి డిజైన్ తో ఈ ఫోన్లను ఎల్ జీ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ధర విషయంలో కూడా భారత వినియోగదారులకు చేరువలోనే ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
ఎల్ జీ కే10 ఫీచర్స్
5.3 అంగుళాల హెచ్ డీ(720x1280 ఫిక్సల్స్) రిజుల్యూషన్ డిస్ ప్లే
2జీబీ ర్యామ్
16జీబీ ఇంటర్ నల్ మెమెరీ
13ఎంపీ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
2,300 ఎమ్ హెచ్ బ్యాటరీ
తెలుపు, ఇండిగో, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది.
ఎల్ జీ కే7 ఫీచర్స్
5 అంగుళా ఎఫ్ డబ్ల్యూవీజీఏ(854x480 ఫిక్సల్స్) రిజుల్యూషన్ డిస్ ప్లే
1.2 జీహెచ్ జడ్ క్వాడ్ -కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ ప్రాసెసర్
5జీబీ ర్యామ్
8జీబీ ఇంటర్ నల్ మెమెరీ
8ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
2,125 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
టైటాన్ రంగులో లభ్యమవుతుంది.
కానీ భారత మార్కెట్లో ఎల్ జీ చాలా పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ఇవే ఫీచర్స్ తో చాలా తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయి.