ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000 | LG G Flex 2 with curved screen goes on sale in India at Rs 54990 | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000

Published Sat, May 2 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000

హైదరాబాద్: ఎల్‌జీ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్,  ఎల్‌జీ జీ ఫ్లెక్స్2ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రముఖ హిందీ సినిమా నటులు అనిల్ కపూర్, నర్గీస్ ఫక్రిలు ఆవిష్కరించారని ఎల్‌జీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్  స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్‌ను అమర్చామని ఎల్‌జీ మొబైల్స్ ఇండియా బిజినెస్ హెడ్ దీపక్ జస్‌రోషియా పేర్కొన్నారు.

ధర రూ.56,000 వరకూ ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ పి-ఓఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 64-బిట్ ఆక్టకోర్ సీపీయూ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement