
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో భాగంగా జీ7 థిన్‌క్యూ పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్లాటినం గ్రే, అరోరా బ్లాక్, మొరాకన్ బ్లూ, రాస్ప్‌బెర్రీ రోజ్ రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లతోపాటు గూగుల్ అసిస్టెంట్ కోసం ఈ ఫోన్‌పై ప్రత్యేకంగా బటన్‌ను పొందుపర్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర , లభ్యత గురించి ఇంకా కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ముందుగా దక్షిణ కొరియాలో విడుదలైన ఈ ఫోన్ ఉత్తర అమెరికా, యూరోప్, లాటిన్ అమెరికా, ఆసియాలో మార్కెట్లు వస్తున్నట్లు సంస్థ నిర్ధారించింది. ఐ ఫోన్ ఎక్స్‌ను పోలి వున్న ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 9ప్లస్, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్, హువావే పీ 20లాంటి ఫోన్లను గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment