
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా కొత్త సీబీ200ఎక్స్ అడ్వెంచరర్–టూరర్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. గురుగ్రాం ఎక్స్‌షోరూంలో ధర రూ.1.44 లక్షలు. వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటుంది.
17 హెచ్‌పీ పవర్, 16 ఎన్ ఎం టార్క్‌తో 184 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్‌ఈడీ లైటింగ్, పూర్తి స్థాయి డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, డ్యూయల్ పర్పస్ టైర్స్, యూఎస్‌డీ ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్ మౌంటెడ్ కీ వంటి హంగులు ఉన్నాయి.
చదవండి : కంటి చూపుతో కాదు కత్తితో..
Comments
Please login to add a commentAdd a comment