ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్ఫోన్ | LG V20 with Google's Android Nougat officially launched | Sakshi
Sakshi News home page

ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్ఫోన్

Published Thu, Sep 8 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్ఫోన్

ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్ఫోన్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఎల్‌జీ తాజాగా ‘వి20’ స్మార్ట్‌ఫోన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. దీని ధర తెలియాల్సి ఉంది.

గూగుల్ కొత్త ఓఎస్ ‘నుగట్’పై పనిచేయనున్న తొలి మొబైల్ ఇదే

 న్యూయార్క్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఎల్‌జీ తాజాగా ‘వి20’ స్మార్ట్‌ఫోన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. దీని ధర తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లువచ్చే నెలలో కొరియా మార్కెట్లోకి అటుపై భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ‘నుగట్’తో మార్కెట్‌లోకి వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. అలాగే ఇందులో తొలిసారిగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్‌ని అమర్చారు.

దీనిసాయంతో లైవ్ పెర్ఫార్మెన్స్‌లో సౌండ్ ఎలా వస్తుందో అలాంటి క్లారిటీ తో కూడిన సౌండ్‌ను హెడ్‌ఫోన్స్‌లో వినొచ్చు. ఇందులో 5.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ , 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ/8 ఎంపీ రియర్ కెమెరాలు, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, గూగుల్ ఇన్‌యాప్ సెర్చ్, సెకండరీ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement