ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్‌ఫోన్
గూగుల్ కొత్త ఓఎస్ ‘నుగట్’పై పనిచేయనున్న తొలి మొబైల్ ఇదే
న్యూయార్క్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఎల్జీ తాజాగా ‘వి20’ స్మార్ట్‌ఫోన్‌ను శాన్ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. దీని ధర తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్ఫోన్లువచ్చే నెలలో కొరియా మార్కెట్లోకి అటుపై భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ‘నుగట్’తో మార్కెట్లోకి వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. అలాగే ఇందులో తొలిసారిగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ని అమర్చారు.
దీనిసాయంతో లైవ్ పెర్ఫార్మెన్స్లో సౌండ్ ఎలా వస్తుందో అలాంటి క్లారిటీ తో కూడిన సౌండ్‌ను హెడ్‌ఫోన్స్‌లో వినొచ్చు. ఇందులో 5.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ , 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ/8 ఎంపీ రియర్ కెమెరాలు, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, గూగుల్ ఇన్‌యాప్ సెర్చ్, సెకండరీ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.