షాకింగ్: స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది | LG smart tv infected virus | Sakshi
Sakshi News home page

షాకింగ్: స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది

Published Thu, Dec 29 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

షాకింగ్: స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది

షాకింగ్: స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది

కేవలం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుందని భావిస్తున్నారా?. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో టీవీలోనే అన్ని రకాల యాప్ లు తదితర సర్వీసులు వినియోగించే అవకాశం స్మార్ట్ టీవీల ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
 
యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన ఎల్ జీ స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది. ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసిన కుటుంబసభ్యులు సినిమా చూస్తుండగా మధ్యలో టీవీ ఆగిపోయింది. ఆ తర్వాత స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఫోటో తప్ప మరేమి రాలేదు. దీంతో సదరు ఇంజనీరు టీవీని రీసెట్ చేయడానికి యత్నించినా కుదరలేదు.
 
దీంతో సంస్ధను సంప్రదించగా.. ఇంటికి వచ్చిన టెక్నీషియన్ రీసెట్ చేయడానికి రూ.23,170/-, సోకిన వైరస్ ను తొలగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, టీవీ యజమాని సదరు యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారా? లేదా వేరే సైట్ల నుంచి డౌన్ లోడ్ చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement