లండన్: లీడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన మేటి సూపర్-50 సంస్థల జాబితాలోటాప్ లో నిలిచిన ఈ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం అమెరికాలోకూడా తన సత్తాను చాటింది. అత్యంత విలువైన 100 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. అమెరికాలో 'టాప్ 500 బ్రాండ్స్' లో 58 ర్యాంకు కొట్టేసింది. బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ ..బ్రాండ్ ఫినాన్స్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ ఐటి కంపెనీల్లో నాలుగవ స్థానం సంపాదించిన టీసీఎస్ ఈ సర్వేలో అమెరికా లో అగ్ర 100 బ్రాండ్ల పరిధిలో గుర్తింపును పొందింది. 78.3 పాయింట్ల స్కోరుతో కంపెనీ 'ఎఎ +'రేటింగ్ సంపాదించి అత్యంత శక్తివంతమైన బ్రాండ్ గా అవతరించింది. అంతేకాదు టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 286 శాతం వృద్ధితో ఐటి సేవల రంగంలో వేగంగా మార్కెట్ ను విస్తరించుకుంది. దీంతో 2010 లో 2.3 బిలియన్ల డాలర్లనుంచి 2016 లో 9.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
అమెరికాలో తాము అందిస్తున్న డిజిటల్ సేవలకు, వినియోగదారుల స్పందన, ఈ ర్యాంకింగ్ అద్దం పడుతుందని టీసీఎస్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్ సూర్యకాంత్ తెలిపారు. ఐటి సేవల రంగంలో బలమైన శక్తిగా ఉద్భవించామనీ, ఈ రంగంలో బలమైన బ్రాండ్ గా నిలిచామని బ్రాండ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ హైగ్ అన్నారు.
తన వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకోవడం, బ్రాండ్ బలం కొనసాగింపు నేపథ్యంలో గత సంవత్సరంలో టీసీఎస్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టింది. శాంటాక్లారా స్టూడియో డిజిటల్ రీఇమాజినేషన్ లాంటి కొత్త ఆవిష్కరణలు సంస్థ ప్రతిభను ఇనుమడింప చేశాయి. 2015 లో న్యూయార్క్ సిటీ మారథాన్ టైటిల్, చికాగో మరియు బోస్టన్ మారథాన్లో టీసీఎస్ టెక్ స్పాన్స్ ర్ గా వ్యవహరించింది. అంతేకాదు అదే ఏడాది యాపిల్ స్టోర్ లో టీసీఎస్ సృష్టించిన యాప్ 275,000 డౌన్ లోడ్స్ తో టాప్ యాప్ గా నిలిచింది. తన వివిధ కార్యక్రమాలతోపాటు స్టెమ్ మెంటార్ షిప్ అవార్డులిస్తోంది. ఫ్లాగ్ షిప్ కార్యక్రమం గో ఐటి ద్వారా 32 నగరాల్లో , 10 వేల మంది విద్యార్ధులకు కోడింగ్ టీచింగ్, రోబోటిక్ అండ్ డిజైనింగ్ లో శిక్షణ ఇస్తోంది.
టాప్ బ్రాండ్ గా టీసీఎస్
Published Tue, Aug 9 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
Advertisement
Advertisement