most valuable
-
అత్యంత విలువైన సంస్థగా ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఎస్బీఐ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థిక సేవల సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తుందని, నికర లాభాలు పెంచుకుంటుందని కొత్త చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ప్రకటించారు. ఎస్బీఐని అత్యుత్తమ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని.. చైర్మన్ బాధ్యతల స్వీకరణ అనంతరం ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 50 కోట్లకు పైగా కస్టమర్లకు ఎస్బీఐ సగర్వంగా సేవలు అందిస్తోందని చెబుతూ.. వివిధ విభాగాల్లో మార్కెట్ అగ్రగామిగా ఉందని, అతిపెద్ద బ్యాలెన్స్ షీట్ పరంగా ఆస్తులపై ఒక శాతం రాబడి నిష్పత్తిని సాధించినట్టు వివరించారు. ‘‘అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా ఎదిగేందుకు కృషి చేయాలి. నికర లాభం నూతన మైలురాళ్లకు చేరుకోవాలి. ప్రతి భారతీయుడి బ్యాంకర్‌గా ఎస్బీఐ స్థానం బలోపేతం కావాలి. అత్యుత్తమ సేవలు అందించాలి. ఉద్యోగులకు ఇష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలి’’అంటూ ఎస్బీఐ సిబ్బందికి శెట్టి సందేశం ఇచ్చారు. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ లాభం రూ.61,077 కోట్లుగా ఉండడం గమనార్హం. బ్యాంక్ చరిత్రలో ఇదే గరిష్ట రికార్డు. ‘‘మాతృభూమి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ది దేశంగా మారుతున్న తరుణంలో మనం ఉండడం అదృష్టం. ఆర్థిక వ్యవస్థలో లోతైన నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు వేగంగా పరిణతి చెందుతున్నాయి. ఇది భారత్‌కు చెందిన దశాబ్దం. ఇది ఎస్బీఐ దశాబ్దం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను’’అని శెట్టి పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన దినేష్ ఖరా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ఈ నెల మొదట్లో శెట్టి నియామకం జరిగిన సంగతి తెలిసిందే.తెలుగుతేజం.. అపార అనుభవం.. కొత్త చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా, మానవపాడు మండలంలోని ఓ మారుమూల గ్రామం పెద్దపోతులపాడులో జని్మంచారు. ఆయన బాల్యం పూర్తిగా ఇదే గ్రామంలో గడిచింది. 7వ తరగతి వరకూ గ్రామంలోనే విద్యనభ్యసించిన ఆయన, అనంతరం గద్వాల్లో పదవ తరగతి, ఇంటర్ పూర్తిచేశారు. అటు తర్వాత హైదరాబాద్ వచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తిచేశారు. ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభం.. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్లో తొలుత పోస్టింగ్‌లో చేరిన ఆయనకు బ్యాంకింగ్‌లో మూడు దశాబ్దాల అపార అనుభవం ఉంది. ఎస్బీఐలో పలు బాధ్యతలను ఆయన నిర్వహించారు. ముఖ్యంగా నాలుగేళ్లపాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్‌లో భాగంగా ఎస్బీఐ ఓవర్సీస్ బాధ్యతలు స్వీకరించి అమెరికాలో పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచి్చన తర్వాత ఎస్బీఐ ఎండీగా పదోన్నతి పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్‌లో సరి్టఫైడ్ అసోసియేట్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ టాస్‌్కఫోర్స్‌లు, కమిటీలకు నేతృత్వం వహించిన శెట్టి, ఎస్బీఐ మెనేజింగ్ డైరెక్టర్‌గా , బ్యాంక్ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు. -
బార్ల్కేస్ హురున్ లిస్ట్.. బిజినెస్‌లో ఈ ఫ్యామిలీలదే హవా
దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితా ప్రారంభ ఎడిషన్‌లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్‌లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం. -
తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ పురస్కారం
ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కడం విశేషం. ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్ జాంగ్ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్ హైయాంగ్ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (2010 గ్వాంగ్జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్ గుర్తింపు పొందారు. -
గిన్నిస్ రికార్డ్: టీపాట్ ధర రూ. 24 కోట్లు! దీని సృష్టికర్త మనోడే..
World most valuable teapot Guinness World Records: సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపాట్‌లు వాడుతూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది? రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఓ టీపాట్ ధర ఏకంగా రూ.24 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను ఇటాలియన్ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు. ఈ టీపాట్ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్కు ‘ది ఇగోయిస్ట్’ (The Egoist) అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విటర్లో షేర్ చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చేయించింది మనోడే! ఈ అత్యంత ఖరీదైన టీపాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్‌ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్‌ను సృష్టించాలనుకుని దీన్ని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. This is the most valuable teapot in the world. Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre. The teapot's handle is made from fossilised mammoth ivory. It… pic.twitter.com/TFZZF63YiW — Guinness World Records (@GWR) August 9, 2023 -
హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం
న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్గేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనంతో భారతీయ కంపెనీ తొలిసారి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది. దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్‌కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్కుగల డిజిటైజేషన్ ప్లాట్ ఫామ్‌లతో పాటు.. భారీ పంపిణీ నెట్వర్క్ గృహ రుణాలతోపాటు గ్రూప్ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీనానికి బోర్డుల గ్రీన్‌సిగ్నల్ ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) కాగా, బీమా రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో మార్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్డీఎఫ్సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. వారాంతాన బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది. -
యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత
అండర్-19 టీమిండియా యంగ్ కెప్టెన్ యశ్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి అండర్-19 ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యశ్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యశ్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన ప్రతీసారి ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యశ్ ధుల్ కెప్టెన్‌గా.. ఈ టోర్నీలో పాల్గోన్న ఎనిమిది దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్తు స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి యశ్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఈ అత్యుత్తమ జట్టును ఐసీసీ మ్యాచ్ రిఫరీ గ్రీమి లాబ్రోయ్, జర్నలిస్ట్ సందీపన్ బెనర్జీ, కామెంటేటర్స్ సామ్యూల్ బద్రి, నాటల్లీ జెర్మనోస్ కలిసి ఎంపిక చేశారు. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ 12 మందితో కూడిన జట్టులో ఓపెనర్లుగా హసీబుల్లాఖాన్(పాకిస్తాన్, వికెట్ కీపర్), టీగు విల్లీ(ఆస్ట్రేలియా).. ఇక టోర్నమెంట్లో పరుగుల వరద పారించి జూనియర్ ఏబీగా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) వన్‌డౌన్‌కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియాను నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన టామ్ పెర్స్ట్ ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో టీమిండియా నుంచి రాజ్ బవా.. శ్రీలంకు నుంచి దునిత్ వెల్లలగే ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్‌గా టీమిండియా తరపున విశేషంగా రాణించిన విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఇక పేసర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన జోష్ బోయెడెన్, పాకిస్తాన్‌కు చెందిన అవైస్ అలీ, బంగ్లాదేశ్‌కు చెందిన రిపన్ మోండోల్ ఎంపికయ్యారు. ఇక జట్టులో పన్నెండవ ఆటగాడిగా అఫ్గనిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఈ ఆల్‌రౌండర్ 10 వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు సాధించాడు. చదవండి: Washington Sundar: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా ఐసీసీ అండర్-19 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్: హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్, పాకిస్థాన్) టీగ్ విల్లీ (ఆస్ట్రేలియా) డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) యశ్ ధుల్ (కెప్టెన్, ఇండియా) టామ్ పెర్స్ట్ (ఇంగ్లండ్) దునిత్ వెల్లలాగే (శ్రీలంక) రాజ్ బవా (భారతదేశం) విక్కీ ఓస్త్వాల్ (భారతదేశం) రిపన్ మోండోల్ (బంగ్లాదేశ్) అవైస్ అలీ (పాకిస్థాన్) జోష్ బోడెన్ (ఇంగ్లండ్) నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) -
టాప్ బ్రాండ్ గా టీసీఎస్
లండన్: లీడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన మేటి సూపర్-50 సంస్థల జాబితాలోటాప్ లో నిలిచిన ఈ గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం అమెరికాలోకూడా తన సత్తాను చాటింది. అత్యంత విలువైన 100 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. అమెరికాలో 'టాప్ 500 బ్రాండ్స్' లో 58 ర్యాంకు కొట్టేసింది. బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ ..బ్రాండ్ ఫినాన్స్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ ఐటి కంపెనీల్లో నాలుగవ స్థానం సంపాదించిన టీసీఎస్ ఈ సర్వేలో అమెరికా లో అగ్ర 100 బ్రాండ్ల పరిధిలో గుర్తింపును పొందింది. 78.3 పాయింట్ల స్కోరుతో కంపెనీ 'ఎఎ +'రేటింగ్ సంపాదించి అత్యంత శక్తివంతమైన బ్రాండ్ గా అవతరించింది. అంతేకాదు టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 286 శాతం వృద్ధితో ఐటి సేవల రంగంలో వేగంగా మార్కెట్ ను విస్తరించుకుంది. దీంతో 2010 లో 2.3 బిలియన్ల డాలర్లనుంచి 2016 లో 9.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అమెరికాలో తాము అందిస్తున్న డిజిటల్ సేవలకు, వినియోగదారుల స్పందన, ఈ ర్యాంకింగ్ అద్దం పడుతుందని టీసీఎస్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్ సూర్యకాంత్ తెలిపారు. ఐటి సేవల రంగంలో బలమైన శక్తిగా ఉద్భవించామనీ, ఈ రంగంలో బలమైన బ్రాండ్ గా నిలిచామని బ్రాండ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ హైగ్ అన్నారు. తన వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకోవడం, బ్రాండ్ బలం కొనసాగింపు నేపథ్యంలో గత సంవత్సరంలో టీసీఎస్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టింది. శాంటాక్లారా స్టూడియో డిజిటల్ రీఇమాజినేషన్ లాంటి కొత్త ఆవిష్కరణలు సంస్థ ప్రతిభను ఇనుమడింప చేశాయి. 2015 లో న్యూయార్క్ సిటీ మారథాన్ టైటిల్, చికాగో మరియు బోస్టన్ మారథాన్‌లో టీసీఎస్ టెక్ స్పాన్స్ ర్ గా వ్యవహరించింది. అంతేకాదు అదే ఏడాది యాపిల్ స్టోర్ లో టీసీఎస్ సృష్టించిన యాప్ 275,000 డౌన్ లోడ్స్ తో టాప్ యాప్ గా నిలిచింది. తన వివిధ కార్యక్రమాలతోపాటు స్టెమ్ మెంటార్ షిప్ అవార్డులిస్తోంది. ఫ్లాగ్ షిప్ కార్యక్రమం గో ఐటి ద్వారా 32 నగరాల్లో , 10 వేల మంది విద్యార్ధులకు కోడింగ్ టీచింగ్, రోబోటిక్ అండ్ డిజైనింగ్ లో శిక్షణ ఇస్తోంది. -
యాంకర్ ఆఫ్ ది డే.
-
రేపటి భారతం-మెరిసే ఇంద్ర ధనస్సులు
-
రేపటి భారతం-కదిలే కాంతులు