న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్‌గేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం కానుంది. ఈ విలీనంతో భారతీయ కంపెనీ తొలిసారి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది.
దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్‌కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్‌కుగల డిజిటైజేషన్ ప్లాట్ ఫామ్‌లతో పాటు.. భారీ పంపిణీ నెట్‌వర్క్ గృహ రుణాలతోపాటు గ్రూప్ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!)
విలీనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది.
విలీనానికి బోర్డుల గ్రీన్‌సిగ్నల్
ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనం కానుంది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట)
కాగా, బీమా రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో మార్టగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. వారాంతాన బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment