హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు.
1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్
హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్‌లైన్‌లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్‌డ్ డియర్‌నెస్ అలవెన్స్ రూ. 500.
అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ లెటర్‌లో పేర్కొంది.
కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్‌ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్‌పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్‌ను నిజమైన టైటాన్‌గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్‌కు లోబడి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment