offer letters
-
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఆఫర్ లెటర్ జారీలో మార్పులు
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది."ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.భారతీయ సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. -
30 నెలలు వెయిట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్
ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్‌బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది. -
ఆఫర్ లెటర్ ఇచ్చారు.. ఉద్యోగం ఇవ్వడం లేదని అనుకుంటున్నారా?
ఉద్యోగానికి ఎంపిక చేశామంటూ ఆఫర్ లెటర్ చేతికి వచ్చి నెలలు దాటింది.. ఇంకా ‘ఆఫర్’(నియామక పత్రం) మాత్రం ఇవ్వడం లేదు. అడిగితే, ఇదిగో..అదిగో.. అంటున్నారని మీరు బాధపడుతుంటే మీకో శుభవార్త. తాజాగా సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆఫర్ లెటర్లు అందుకున్న వారి భవిష్యత్‌పై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో ఈ ఏడాది కాలేజీల్లోక్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని తెలిపింది. పీటీఐ కథనం ప్రకారం..కోవిడ్-19 మహమ్మారి సమయంలో దిగ్గజ ఐటీ కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. కానీ ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం, ఆర్ధికమాంద్యం భయాలతో ఉద్యోగుల్ని ఎడాపెడా తొలగించాయి. తాజాగా ఇన్ఫోసిస్ ఈ ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని తెలిపింది. అందుకు గల కారణాల్ని వివరించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న ఫ్రెషర్స్‌కి ప్రాజెక్ట్‌లు లేక బెంచ్ మీద ఉండడంతో పాటు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఐటీ మార్కెట్‌కు డిమాండ్ తగ్గడమే కారణమని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో వెల్లడించారు. ఫ్రెషర్స్‌కి ఏఐపై శిక్షణ సీఎఫ్‌వో నిరంజన్ రాయ్ క్యూ2 ఫలితాలపై మాట్లాడుతూ..సంస్థలోని ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ని ఏఐపై ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం, ఫ్రెషర్స్‌ని నియమించుకునే ఆలోచన లేదన్న ఆయన.. డిమాండ్ దృష్ట్యా గత ఏడాది 50,000 మందిని నియమించుకున్నామని అన్నారు. అయితే, వారిలో ఎక్కువగా మంది బెంచ్‌కే పరిమితం అయ్యారని, వారికి జెన్ ఏఐలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ‘ప్రస్తుతానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వెళ్లడం లేదు. మా భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా నియామకాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఆఫర్ లెటర్లు ఇచ్చారు సరే.. ఉద్యోగాలేవి ఇన్ఫోసిస్ ఇప్పటికే వందల మందని నియమించుకుంది. వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతుంది. ఇదే అంశంపై సీఎఫ్‌వో నిరంజన్ రాయ్ మాట్లాడుతూ..అభ్యర్ధులకు ఆఫర్ లెటర్లు ఇచ్చాం. దానికి సంస్థ ఇప్పటికీ కట్టుబడి ఉంది. ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు నియమించుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తీర్ణత పేరుతో ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల్ని తొలగింది. కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించే ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ (FA) పరీక్ష నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. నా బృందంలోని 150 మందిలో 60 మంది మాత్రమే ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారందరూ రెండు వారాల క్రితం తొలగించారు. మునుపటి బ్యాచ్ నుండి (జూలై 2022లో ఆన్‌బోర్డ్ చేసిన ఫ్రెషర్లు), పరీక్షలో విఫలమైన 150 మందిలో దాదాపు 85 మంది ఫ్రెషర్లు లేఆఫ్స్‌కు గురైనట్లు ఇన్ఫోసిస్‌లోని ఒక ఫ్రెషర్ ఆ సమయంలో బిజినెస్ టుడే’కి చెప్పారు మేలో, కంపెనీ మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం తగ్గించింది. -
హెచ్‌డీఎఫ్‌సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు. 1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్ హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్లైన్లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా హెచ్డీఎఫ్సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్డ్ డియర్నెస్ అలవెన్స్ రూ. 500. అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ ఆఫర్ లెటర్లో పేర్కొంది. కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్‌ను నిజమైన టైటాన్‌గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్‌కు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది. -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్‌కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్ లెటర్లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్ ప్రీత్ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్ బోర్డర్ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్ఏ) విచారణలో తేలింది. దీంతో జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్ ప్రీత్ సింగ్‌తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్‌కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు. రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్‌ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది. -
జాబ్ వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాల అంశం కలవరపెడుతోంది. క్యాంపస్ నియామకాల్లో ఎంపికై ఆఫర్ లెటర్లు వచ్చినా.. ఉద్యోగాల్లో చేరడానికి ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న సంస్థల నుంచి ఐటీ దిగ్గజాల దాకా ఇలాగే వ్యవహరిస్తుండటం.. ఆఫర్ లెటర్లు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడం తీవ్ర ఆందోళన రేపుతోంది. పారిశ్రామిక వర్గాల లెక్కల ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో తెలంగాణలో బహుళజాతి సంస్థలు, అంకుర సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు కలిపి 24,500 మందిని క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇందులో ఇప్పటివరకు 2,300 మందికి మాత్రమే నియామక ఉత్తర్వులు వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగిన నియామకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులు.. క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. గత ఏడాది ఆగస్టులో సాఫ్ట్వేర్ కంపెనీలు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టాయని.. పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని, ఆ తర్వాత మరే స్పందనా లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు నన్ను బీటెక్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే ఓ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపిక చేసింది. రెండో సెమిస్టర్ కాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని.. అప్పట్నుంచే శిక్షణ మొదలవుతుందని, వేతనం కూడా ఇస్తామని చెప్పారు. కానీ 10 నెలలు గడిచింది. ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. – ప్రవీణ్ వర్మ, హైదరాబాద్, క్యాంపస్ రిక్రూటీ చిన్న కంపెనీలు తీసుకుంటున్నా.. అంకుర సంస్థలు, చిన్న కంపెనీలు మాత్రం క్యాంపస్ నియామకాల్లో ఎంపిక చేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి ఆహా్వనిస్తున్నాయి. కానీ అవసరమైన మేర తక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత ఆశించిన మేర ప్రాజెక్టులు రావడం లేదని.. అందుకే ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగాల్లోకి పిలవలేక పోతున్నామని కొన్ని కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపేయడమేగాక.. ఉన్న ఉద్యోగుల వేతనాలు తగ్గించుకుంటున్నాయని అంటున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. మాంద్యం ప్రభావంతోనే! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంద గమనం కొనసాగుతోంది. దీనితో ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో వెనుకాడుతున్నాయి. అమెరికాలో అత్యధిక ద్రవోల్బణం, స్థిరాస్తి, బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో.. అక్కడ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కనీసం రెండేళ్లు పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూరప్ దేశాలు, జపాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త నియామకాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. మాది వరంగల్. ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. చివరి సెమిస్టర్లో ఉండగా.. మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఇప్పటికీ అపాయింట్మెంట్ రాలేదు. ఎన్ని మెయిల్స్ చేసినా స్పందన లేదు. బంధువులకు ముఖం చూపించలేక.. హైదరాబాద్‌లోనే ఉండి కోర్సులు నేర్చుకుంటున్నాను. – అఖిలేశ్ గౌడ్, క్యాంపస్ రిక్రూటీ, హైదరాబాద్ స్పెషల్ స్కిల్స్ ముఖ్యం ఇంకో ఏడాది పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ నియామకాలపై ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికే నియామకాలు జరగలేదు. ఏఐ, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, మెషీన్ లెరి్నంగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న వారికి మాత్రం మార్కెట్ బాగానే ఉంటోంది. – మిత్రాసేథ్, ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగి -
ఉద్యోగాల ఊచకోత తరువాత ‘మెటా’ మరో షాకింగ్ డెసిషన్
న్యూఢిల్లీ: వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఫుల్ టైం ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వేల ఉద్యోగులను తొలగించిన సంస్థ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే తొలిసారని పలువురు వ్యాఖ్యానించారు. నియామక అవసరాలను తిరిగి అంచనా వేయడం కొనసాగిస్తున్నాం. చాలా స్వల్ప సంఖ్యలో అభ్యర్థుల ఆఫర్లను ఉపసంహరించుకుంటూ కష్టమైన నిర్ణయం తీసుకున్నామన్న మెటా ప్రతినిధి వ్యాఖ్యలను టెక్ క్రంచ్ నివేదించింది. మెటా ఇటీవల 20 మంది ఆఫర్లను రద్దు చేసిందని ఇంజనీర్ ,రచయిత గెర్గెలీ ఒరోస్జ్ ట్వీట్ చేశారు. ప్రపంచ మాంద్యం భయాలు నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022 నవంబరులో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను ఫేస్బుక్ తొలగించడం టెక్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తన లండన్ కార్యాలయంలో 2023 వేసవి ఇంటర్న్‌షిప్ ఆఫర్లను రద్దు చేసింది Just in: Meta has rescinded fulltime offers in London, as I confirmed with devs impacted. New grads with offers due to start in February have been taken back in bulk. I know of about 20 people so far. This is the first time I'm aware that Meta is taking back signed, FTE offers. — Gergely Orosz (@GergelyOrosz) January 9, 2023 -
ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ్ర΄÷ఫైల్‌కు సరిపడే సర్టిఫికేషన్స్ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్ డ్రైవ్‌లో తమ అకడమిక్ ప్రతిభను, మార్కులను, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ► ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఇప్పటికే ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ► దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ► దేశీయంగానూ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. n గూగుల్ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది. మాంద్యం సంకేతాలే కారణమా! ► ఐటీలో ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలా΄ాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు. చదవండి: ‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు! -
ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్అండ్టీ
ఐఐఎం పట్టభద్రులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఎంతకీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఫ్లిప్‌కార్ట్ మీద జనం దుమ్మెత్తి పోసిన సంగతి గుర్తుంది కదూ. ఇప్పుడు అదేబాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కూడా పయనిస్తోంది. వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఆ కంపెనీ రద్దుచేసింది. అంటే.. ముందు ఉద్యోగం ఇస్తాం రమ్మని చెప్పి, ఆ తర్వాత లేదు పొమ్మందన్న మాట. దాంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. తమకు చేతిలో ఉద్యోగం ఉంది కదా అన్న నమ్మకంతో వేరే ప్రయత్నాలు ఏమీ చేయని వాళ్లు.. చదువుకోడానికి తాము తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లను తీర్చాలంటూ బ్యాంకుల నుంచి పదే పదే ఫోన్లు రావడంతో ఏం చేయాలో తెలియక వాపోతున్నారు. పైగా, ఒకసారి ఒక కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందంటే, మరో కంపెనీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకు వెళ్లడానికి వీల్లేదని తమిళనాడులో దాదాపు అన్ని కాలేజీలలో నిబంధన ఉందని ఓ విద్యార్థి చెప్పాడు. తమ పెర్ఫార్మెన్సు తగినవిధంగా లేని కారణంగా ఆఫర్ రద్దుచేస్తున్నట్లు మెయిల్ పంపారని, ఇప్పుడు ఏం చేయాలని వాపోయాడు. ప్లేస్మెంట్లు బాగున్నాయనే ఈ కాలేజీలలో ఫీజు ఎక్కువైనా చేరి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నామని, ఇప్పుడు బ్యాంకులు దాదాపు ప్రతిరోజూ తమకు లేఖలు పంపుతున్నాయని మరో విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇన్నాళ్ల బట్టి తొందరపడొద్దు, జాయినింగ్ డేట్ త్వరలోనే చెబుతామన్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ వాళ్లు ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్పారని మండిపడ్డాడు. తమకు జరిగిన అన్యాయంపై విద్యార్థులు నిరాహార దీక్షలకు కూడా దిగారు. మరికొన్ని కంపెనీలు కూడా.. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ల పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి విషయం తెలుస్తోంది కానీ, ఇంకా చాలా కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఇన్మోర్బి, కార్దేఖో, హాప్స్కాచ్ లాంటి కంపెనీలు కూడా తొలుత ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. దీనివల్ల కాలేజీల ట్రాక్ రికార్డు కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.