ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్‌బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.
విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.
ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment