ఉద్యోగానికి ఎంపిక చేశామంటూ ఆఫర్ లెటర్ చేతికి వచ్చి నెలలు దాటింది.. ఇంకా ‘ఆఫర్’(నియామక పత్రం) మాత్రం ఇవ్వడం లేదు. అడిగితే, ఇదిగో..అదిగో.. అంటున్నారని మీరు బాధపడుతుంటే మీకో శుభవార్త. తాజాగా సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆఫర్ లెటర్లు అందుకున్న వారి భవిష్యత్‌పై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో ఈ ఏడాది కాలేజీల్లోక్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని తెలిపింది.
పీటీఐ కథనం ప్రకారం..కోవిడ్-19 మహమ్మారి సమయంలో దిగ్గజ ఐటీ కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. కానీ ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం, ఆర్ధికమాంద్యం భయాలతో ఉద్యోగుల్ని ఎడాపెడా తొలగించాయి. తాజాగా ఇన్ఫోసిస్ ఈ ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని తెలిపింది. అందుకు గల కారణాల్ని వివరించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న ఫ్రెషర్స్‌కి ప్రాజెక్ట్‌లు లేక బెంచ్ మీద ఉండడంతో పాటు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఐటీ మార్కెట్‌కు డిమాండ్ తగ్గడమే కారణమని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో వెల్లడించారు.
ఫ్రెషర్స్‌కి ఏఐపై శిక్షణ
సీఎఫ్‌వో నిరంజన్ రాయ్ క్యూ2 ఫలితాలపై మాట్లాడుతూ..సంస్థలోని ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ని ఏఐపై ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం, ఫ్రెషర్స్‌ని నియమించుకునే ఆలోచన లేదన‍్న ఆయన.. డిమాండ్ దృష్ట్యా గత ఏడాది 50,000 మందిని నియమించుకున్నామని అన్నారు. అయితే, వారిలో ఎక్కువగా మంది బెంచ్‌కే పరిమితం అయ్యారని, వారికి జెన్ ఏఐలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ‘ప్రస్తుతానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వెళ్లడం లేదు. మా భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా నియామకాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
ఆఫర్ లెటర్లు ఇచ్చారు సరే.. ఉద్యోగాలేవి
ఇన్ఫోసిస్ ఇప్పటికే వందల మందని నియమించుకుంది. వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతుంది. ఇదే అంశంపై సీఎఫ్‌వో నిరంజన్ రాయ్ మాట్లాడుతూ..అభ్యర్ధులకు ఆఫర్ లెటర్‌లు ఇచ్చాం. దానికి సంస్థ ఇప్పటికీ కట్టుబడి ఉంది. ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు నియమించుకుంటామని హామీ ఇచ్చారు.
ఉత్తీర్ణత పేరుతో ఉద్యోగుల తొలగింపు
ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల్ని తొలగింది. కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించే ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (FA) పరీక్ష నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. నా బృందంలోని 150 మందిలో 60 మంది మాత్రమే ఎఫ్‌ఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారందరూ రెండు వారాల క్రితం తొలగించారు. మునుపటి బ్యాచ్ నుండి (జూలై 2022లో ఆన్‌బోర్డ్ చేసిన ఫ్రెషర్లు), పరీక్షలో విఫలమైన 150 మందిలో దాదాపు 85 మంది ఫ్రెషర్లు లేఆఫ్స్‌కు గురైనట్లు ఇన్ఫోసిస్‌లోని ఒక ఫ్రెషర్ ఆ సమయంలో బిజినెస్ టుడే’కి చెప్పారు
మేలో, కంపెనీ మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment