హెచ్‌డీఎఫ్‌సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.
పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్‌ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారాలతో నష్టం ఎంతంటే..
ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్‌లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్‌ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment