అండర్-19 టీమిండియా యంగ్ కెప్టెన్ యశ్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి అండర్-19 ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యశ్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యశ్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
అండర్-19 ప్రపంచకప్ ముగిసిన ప్రతీసారి ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యశ్ ధుల్ కెప్టెన్‌గా.. ఈ టోర్నీలో పాల్గోన్న ఎనిమిది దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్తు స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి యశ్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓస్త్వాల్‌కు చోటు దక్కింది. ఈ అత్యుత్తమ జట్టును ఐసీసీ మ్యాచ్ రిఫరీ గ్రీమి లాబ్రోయ్, జర్నలిస్ట్ సందీపన్ బెనర్జీ, కామెంటేటర్స్ సామ్యూల్ బద్రి, నాటల్లీ జెర్మనోస్ కలిసి ఎంపిక చేశారు.
చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్
12 మందితో కూడిన జట్టులో ఓపెనర్లుగా హసీబుల్లాఖాన్(పాకిస్తాన్, వికెట్ కీపర్), టీగు విల్లీ(ఆస్ట్రేలియా).. ఇక టోర్నమెంట్‌లో పరుగుల వరద పారించి జూనియర్ ఏబీగా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) వన్‌డౌన్‌కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియాను నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన టామ్ పెర్స్ట్ ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో టీమిండియా నుంచి రాజ్ బవా.. శ్రీలంకు నుంచి దునిత్ వెల్లలగే ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్‌గా టీమిండియా తరపున విశేషంగా రాణించిన విక్కీ ఓస్త్వాల్‌కు చోటు దక్కింది. ఇక పేసర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన జోష్ బోయెడెన్, పాకిస్తాన్‌కు చెందిన అవైస్ అలీ, బంగ్లాదేశ్‌కు చెందిన రిపన్ మోండోల్ ఎంపికయ్యారు. ఇక జట్టులో పన్నెండవ ఆటగాడిగా అఫ్గనిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఈ ఆల్‌రౌండర్ 10 వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు సాధించాడు.
చదవండి: Washington Sundar: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా
ఐసీసీ అండర్-19 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:
హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్, పాకిస్థాన్)
టీగ్ విల్లీ (ఆస్ట్రేలియా)
డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా)
యశ్ ధుల్ (కెప్టెన్, ఇండియా)
టామ్ పెర్స్ట్ (ఇంగ్లండ్)
దునిత్ వెల్లలాగే (శ్రీలంక)
రాజ్ బవా (భారతదేశం)
విక్కీ ఓస్త్వాల్ (భారతదేశం)
రిపన్ మోండోల్ (బంగ్లాదేశ్)
అవైస్ అలీ (పాకిస్థాన్)
జోష్ బోడెన్ (ఇంగ్లండ్)
నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్)
Comments
Please login to add a commentAdd a comment