team selection
-
November 30: భారత క్రికెట్‌కు బిగ్ డే
భారత క్రికెట్‌కు ఇవాళ (నవంబర్ 30) బిగ్ డేగా చెప్పవచ్చు. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటన కోసం నేడు టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై నెల పాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా హాజరయ్యే అవకాశముందని తెలుస్తుంది. వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు స్వస్తి పలుకుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి సెలెక్షన్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్, కోహ్లిలను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తారో లేదోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావిస్తున్న రోహిత్‌ను బీసీసీఐ బుజ్జగించిందని సమాచారం. రోహిత్‌ను వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగేందుకు ఒప్పించారని తెలుస్తుంది. హిట్‌మ్యాన్ సౌతాఫ్రికా పర్యటనకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు విరాట్ సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ఇకపై విరాట్ కూడా కేవలం టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్, రాహుల్‌లను టెస్ట్ జట్టుకు ఎంపిక చేస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. వికెట్‌కీపర్ అవసరం ఉంది కాబట్టి రాహుల్‌కు లైన్ క్లియర్ అయినా.. సీనియర్ రహానేను కాదని శ్రేయస్‌కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. అలాగే టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందోనని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
ఆసియా కప్ ఆడడంపై కోహ్లి కీలక నిర్ణయం!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుంది. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి ఇప్పుడు అర్థ శతకం మార్క్‌ను కూడా అందుకోలేకపోతున్నాడు. తన ఫేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్యన రెస్ట్ పేరుతో అతడిని దూరం పెడుతున్నప్పటికి పరోక్షంగా కోహ్లి క్రమక్రమంగా జట్టుకు దూరమవుతున్నాడని కొందరు పేర్కొన్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని కోహ్లిని విండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక కోహ్లిని జింబాబ్వే టూర్‌కు ఎంపికచేస్తారని అంతా భావించారు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని ఆశపడ్డారు. తాజాగా శనివారం ప్రకటించిన జింబాబ్వే టూర్‌కు కూడా కోహ్లి పేరును పరిగణలోకి తీసుకోలేదు. రెస్ట్ పేరుతో సీనియర్లందరిని పక్కనబెట్టినట్లు బీసీసీఐ పేర్కొన్నప్పటికి.. ఫామ్‌లో లేని కోహ్లికి రెస్ట్ ఎందుకన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఆసియాకప్‌కైనా కోహ్లిని ఎంపిక చేస్తారా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. అయితే త్వరలో జరగనున్న ఆసియా కప్ ఆడడంపై కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తాను ఆసియాకప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సెలెక్టర్లకు ఫోన్ ద్వారా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఒక అధికారి మాట్లాడుతూ..'' కోహ్లి సెలక్టర్లకు ఫోన్ చేసిన మాట నిజమే. ఆసియాకప్‌కు తాను అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు స్పష్టం చేశాడు. ఆసియా కప్ కోసం కొంతమంది ఆటగాళ్లకు రెస్ట్ పేరుతో విశ్రాంతినిస్తున్నాం. ఇక టి20 ప్రపంచకప్ వరకు టీమిండియా బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. అందుకే రొటేషన్ పాలసీ పేరుతో ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తున్నాం'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియాకప్ యూఏఈ వేదికగా జరగనుంది. మొదట శ్రీలంకలో ఆసియాకప్‌ను నిర్వహించాలని భావించినప్పటికి దేశ ఆర్థిక సంక్షోభం దృష్యా ఆసియా కప్‌ను యూఏఈకి తరలించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. రెండు గ్రూఫులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. చదవండి: జింబాబ్వేలో పర్యటించే టీమిండియా ఇదే..! -
యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత
అండర్-19 టీమిండియా యంగ్ కెప్టెన్ యశ్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి అండర్-19 ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యశ్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యశ్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన ప్రతీసారి ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యశ్ ధుల్ కెప్టెన్‌గా.. ఈ టోర్నీలో పాల్గోన్న ఎనిమిది దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్తు స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి యశ్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఈ అత్యుత్తమ జట్టును ఐసీసీ మ్యాచ్ రిఫరీ గ్రీమి లాబ్రోయ్, జర్నలిస్ట్ సందీపన్ బెనర్జీ, కామెంటేటర్స్ సామ్యూల్ బద్రి, నాటల్లీ జెర్మనోస్ కలిసి ఎంపిక చేశారు. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ 12 మందితో కూడిన జట్టులో ఓపెనర్లుగా హసీబుల్లాఖాన్(పాకిస్తాన్, వికెట్ కీపర్), టీగు విల్లీ(ఆస్ట్రేలియా).. ఇక టోర్నమెంట్లో పరుగుల వరద పారించి జూనియర్ ఏబీగా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) వన్‌డౌన్‌కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియాను నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన టామ్ పెర్స్ట్ ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో టీమిండియా నుంచి రాజ్ బవా.. శ్రీలంకు నుంచి దునిత్ వెల్లలగే ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్‌గా టీమిండియా తరపున విశేషంగా రాణించిన విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఇక పేసర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన జోష్ బోయెడెన్, పాకిస్తాన్‌కు చెందిన అవైస్ అలీ, బంగ్లాదేశ్‌కు చెందిన రిపన్ మోండోల్ ఎంపికయ్యారు. ఇక జట్టులో పన్నెండవ ఆటగాడిగా అఫ్గనిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఈ ఆల్‌రౌండర్ 10 వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు సాధించాడు. చదవండి: Washington Sundar: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా ఐసీసీ అండర్-19 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్: హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్, పాకిస్థాన్) టీగ్ విల్లీ (ఆస్ట్రేలియా) డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) యశ్ ధుల్ (కెప్టెన్, ఇండియా) టామ్ పెర్స్ట్ (ఇంగ్లండ్) దునిత్ వెల్లలాగే (శ్రీలంక) రాజ్ బవా (భారతదేశం) విక్కీ ఓస్త్వాల్ (భారతదేశం) రిపన్ మోండోల్ (బంగ్లాదేశ్) అవైస్ అలీ (పాకిస్థాన్) జోష్ బోడెన్ (ఇంగ్లండ్) నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) -
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
Shafali Verma: షఫాలీ వర్మకు ప్రమోషన్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 సంచలనం షఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లు టి20లే ఆడిన 17 ఏళ్ల హరియాణా అమ్మాయి షఫాలీ ఇప్పుడు తొలిసారి భారత టెస్టు, వన్డే జట్లకూ ఎంపికైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత సీనియర్ మహిళల టెస్టు, వన్డే, టి20 జట్లను శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ పూర్తిస్థాయి టూర్లో అమ్మాయిల జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు, వన్డేల జట్లకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా ఉంటుంది. భారత్ తరఫున 23 టి20 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి తొలిసారి వన్డే, టెస్టు జట్టులో స్థానం లభించింది. సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ తిరిగి జట్టులోకి వచ్చారు. గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌కు శిఖా పాండే, ఏక్తాబిష్త్లను సెలక్టర్లు దూరం పెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1–4తో... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1–2తో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన రాజేశ్వరి గైక్వాడ్, మాన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష, నుజత్ పర్వీన్, ఆయూషి సోని, సుష్మా వర్మ, శ్వేత వర్మ, యస్తిక భాటియా, హేమలతలను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా ఒకే ఒక్కరు వచ్చారు. జార్ఖండ్ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ మూడు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే రెగ్యులర్ కీపర్ తానియా భాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పర్యటన కోసం అమ్మాయిలు ఈ నెల 18న ముంబైలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్క డే రెండు వారాలు క్వారంటైన్లో గడిపి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ బయలుదేరుతారు. భారత మహిళల టెస్టు, వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్, సిమ్రన్. -
టోక్యో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు. అయితే ఎన్ఆర్ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్‌కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, తమిళనాడు షూటర్ ఇలవేనిల్ వలారివన్‌కు టోక్యోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్ఆర్ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో టోక్యో బెర్త్ సాధిం చిన చింకీ యాదవ్‌ను కాదని మనూ భాకర్‌కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్‌గా ఎంపిక చేశారు. పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ. స్కీట్ ఈవెంట్: అంగద్‌వీర్, మేరాజ్ అహ్మద్‌ఖాన్. మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్. -
కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?
ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీరుపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి జట్టులో పలు మార్పులు చేశాడు. ఈ మార్పులపై కోహ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, స్నిన్నర్ చహల్‌లను కాదని మనీష్ పాండే, సంజూ శాంసన్, దీపక్ చాహర్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు. ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశాడో కోహ్లి చెప్పాలని సెహ్వాగ్ ప్రశ్నించాడు. కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవ్వగా.. సంజు శాంసన్ 23 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. సోనీ టీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ ఈ వాఖ్యలు చేశాడు. 'నిజానికి బుమ్రా వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా చివరి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. అలాంటి బుమ్రాను కోహ్లి ఎందుకు పక్కనపెట్టాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్ గురించి చాలా చర్చ జరిగింది. దాంతో.. ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశమివ్వగా అతను వన్డే, టీ20ల్లో నిలకడగా రాణించి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో ఉన్నాడు. (చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు') కానీ తాజాగా తొలి టీ20లో అయ్యర్‌పై వేటు పడడం వెనుక కోహ్లి అంతర్యం ఏమిటో అర్థం కాలేదు. నన్నెందుకు తీశావు అని కోహ్లిని అడిగే ధైర్యం అయ్యర్‌కు ఉండదు.. ఎందుకంటే కోహ్లి టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి రూల్స్ అందరికీ వర్తిస్తాయి.. ఒక్క విరాట్ కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. అతనికి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం తప్పు. కోహ్లి తన పద్దతిని మార్చుకుంటే మంచిది' అని సెహ్వాగ్ సూచించాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా) -
అందుకే విహారి జట్టులోకి వచ్చాడు: కోహ్లి
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ తొలి రోజు తుది జట్టు ఎంపికపై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై జట్టు కెప్టెన్ కోహ్లి మ్యాచ్ ముగిసిన తర్వాత వివరణ ఇచ్చాడు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనాల కోసమేనన్న కెప్టెన్... టెస్టులో సహచరుల ఆటపై ప్రశంసలు కురిపించాడు. ‘తుది జట్టు విషయంలో మేమందరం కలిసి ముందుగా చర్చించుకొని ఆ తర్వాత టీమ్‌కు ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆడే 11 మంది విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమేనని అందరూ అర్థం చేసుకుంటారు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ సమర్థించుకున్నాడు. ‘కాంబినేషన్ కీలకం కాబట్టి విహారి జట్టులోకి వచ్చాడు. అతను నాణ్యమైన పార్ట్‌టైమ్ బౌలర్. ఓవర్‌రేట్ పెరిగిపోతోందని అనిపించిన సమయంలో విహారి పనికొస్తాడు’ అని విరాట్ చెప్పాడు. తాను అనుకున్న వ్యూహాలను సహచరులందరూ సమర్థంగా అమలు చేయడం ఆనందంగా ఉందని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇక ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రుటిలో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 93 పరుగులతో ఆకట్టుకున్న అతను ఇకపై తన ఆఫ్‌స్పిన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించాడు. 1: విదేశీ గడ్డపై భారత్‌కు ఇదే (318 పరుగులు) అతి పెద్ద విజయం. 2017లో శ్రీలంకను (గాలే) భారత్ 304 పరుగులతో ఓడించింది. 27: కోహ్లి కెప్టెన్సీలో భారత్‌కు ఇది 27వ టెస్టు విజయం. అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా ధోని (27) రికార్డును కోహ్లి సమం చేశాడు. 12: కోహ్లి కెప్టెన్సీలో విదేశాల్లో భారత్ 12 టెస్టులు గెలిచింది. ఈ క్రమంలో విదేశీ గడ్డపై అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా గంగూలీ (11) ఘనతను విరాట్ అధిగమించాడు. 100: అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) కెప్టెన్‌గా కోహ్లికిది వందో విజయం. అతనికంటే ముందు భారత్ తరఫున ధోని (178), అజహర్ (104) వందకంటే ఎక్కువ విజయాలు సాధించారు. 100: భారత్‌పై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో ఆ జట్టు 103 పరుగులు చేసింది. -
‘చిక్కుముడి’ వీడేదెలా..!
‘ప్రయోగాలు చేయడం అనే మాట మా వద్ద నిషేధం. అలాంటి ఆలోచనే లేదు. అత్యుత్తమ 11 మందిని ఆడించడం, ఎవరు దానికి సరిపోతారో సరి చూసుకోవడమే మా వ్యూహం’... ముక్కోణపు టోర్నీ సందర్భంగా ధోని చెబుతూ వచ్చిన మాట ఇది. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మన ఆట, ఆ తర్వాత ధోని వ్యాఖ్యలు చూస్తే తుది జట్టు ఎంపిక, వ్యూహాలకు సంబంధించి అతనికి ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు. ఈ టోర్నీలో భారత్ నాలుగు వన్డే లు ఆడింది. మూడు ఓడితే, ఒకటి రద్దయింది. ఈ మ్యాచ్‌ల ఫలితం ప్రపంచకప్‌పై ఉండకపోవచ్చుగాక... కానీ అలాంటి మెగా టోర్నీకి ముందు ఇది సరైన సన్నాహకం మాత్రం కాదు. తుది జట్టు ఏమిటి... ఈ టోర్నీలో అనుసరించిన వ్యూహాలను ప్రయోగాలు అనవచ్చా లేక కెప్టెన్ తాను అనుకుంటున్న ‘బెస్ట్ ఎలెవన్’ టీమ్ ఇదేనా చూడాలి. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో కోహ్లిని నాలుగో స్థానంలో ఆడించి మరోసారి మూడో స్థానానికి మార్చారు. అతను అక్కడా విఫలమయ్యాడు. మూడో స్థానంలో ఫర్వాలేదనిపించిన రాయుడును ఒక్కసారిగా ఐదుకు పంపి, రైనాను ముందుకు తెచ్చారు. ఇదీ దెబ్బ తీసింది. బ్యాటింగ్‌ను పటిష్టంగా మార్చడం కోసమే ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నామని కెప్టెన్ చెబుతాడు గానీ మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి అక్షర్ ఆడిన బంతులు 8! ఇషాంత్ ఫిట్‌గా లేకపోతే, భువీ ఫామ్‌లో లేడని భావిస్తే పెర్త్‌లాంటి బౌన్సీ వికెట్‌పై ఉమేశ్‌కు అవకాశం ఇస్తే అతని సత్తా ఏమిటో తెలిసేది కదా. ప్రపంచ కప్ జట్టులోనే లేని మోహిత్‌ను ఆడించడంలో ఔచిత్యమేముంది! పైగా జడేజా, అక్షర్ ఇద్దరూ ఒకే శైలికి చెందిన ఆటగాళ్లు. ముగ్గురు పేసర్లతో ఆడితే ఓవర్ రేట్ సమస్య వస్తుందంటూ చెప్పిన ధోని... తుది జట్టులో ఐదుగురు ప్రధాన బౌలర్లు కాకుండా నలుగురితోనే (ఇద్దరు స్పిన్నర్లు) దిగుతామని సూత్రప్రాయంగా వెల్లడించాడు. గత రెండు మ్యాచ్‌లలో బిన్నీలాంటి పార్ట్టైమర్తో తొలి ఓవర్ వేయించడాన్ని బట్టి మూడో పేసర్ స్థానానికి అతను దాదాపు ఖాయం అనిపిస్తోంది. కానీ శుక్రవారం మ్యాచ్‌లో బిన్నీ బ్యాటింగ్ చూస్తే కెప్టెన్ ‘బలమైన బ్యాటింగ్ ఆర్డర్’ కోరికకు ఏ మాత్రం న్యాయం చేయగలడో సందేహమే. పరిష్కరించలేని పజిల్లా మా పరిస్థితి ఉందంటూ ధోని విభిన్నంగా స్పందించడాన్ని చూస్తే... ఈ టోర్నీతో చిక్కు ముడులు వీడలేదని, తాను అనుకున్న తుది కూర్పు ఇంకా రాలేదని మాత్రం ధోని చెప్పకనే చెప్పేశాడు. -
జట్టు ‘ఎంపిక’పై వివాదం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి రాక ముందే జట్ల ఎంపికపై ఇప్పుడు కొత్త దుమారం చెలరేగింది. ఈ నెల 15నుంచి చెన్నైలో జరగబోయే బుచ్చిబాబు టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును గురువారం హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వినోద్ ప్రకటించారు. ఇది హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్ధమని సీనియర్ సభ్యుడొకరు ఆరోపించారు. గత నెలలోనే కమిటీ రద్దయిందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఒక వివాదం సాగుతుండగా...వినోద్ మరింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ‘నియమావళి ప్రకారం హెచ్‌సీఏలోని ఏ సబ్ కమిటీకైనా కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. సెలక్షన్ కమిటీకి కూడా అతనే కన్వీనర్. కార్యదర్శి లేనట్లయితే సంయుక్త కార్యదర్శి ఆ బాధ్యత నిర్వహించాలి. అంతే తప్ప జట్టును ఎంపిక చేసి ప్రకటించేందుకు అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదు’ అని ఆయన చెప్పారు. హెచ్‌సీఏలో ఇద్దరు సంయుక్త కార్యదర్శులు ఉండగా, ఎవరికీ కూడా ఈ టీమ్ సెలక్షన్ గురించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ జట్టు చెన్నైకి వెళ్లి టోర్నీ ఆడే వరకు సందేహమేనని హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడా అంతే! మరో వైపు నేటి నుంచి జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) తరఫున రెండు అండర్-19 టీమ్‌లను ఎంపిక చేశారు. ఇది కూడా కార్యదర్శితో సంబంధం లేకుండా అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ సొంతంగా ఎంపిక చేసుకున్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమేనని తెలుస్తోంది. -
జహీర్, హర్భజన్‌కు మరోసారీ..
వెస్టిండీస్‌తో వచ్చే నెల 6 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. గురువారమిక్కడ సమావేశమైన భారత సెలెక్షన్ కమిటీ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. వెటరన్ బౌలర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. భుజం నొప్పితో బాధపడుతున్న రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. ఓపెనర్ శిఖర్ ధవన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తన చరిత్రాత్మక 200 వ టెస్టు ఆడుతుండటంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. జట్టు: ధోనీ (కెప్టెన్), ధవన్, మురళీ విజయ్, పుజారా, సచిన్, కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్, ఓఝా, అమిత్ మిశ్రా, రహానె, ఉమేష్, మహ్మద్ షమీ, రోహిత్, ఇషాంత్.