ఈసెట్‌కు 11 వేల మంది | Eset 11 thousand people | Sakshi
Sakshi News home page

ఈసెట్‌కు 11 వేల మంది

Published Sat, May 10 2014 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

ఈసెట్‌కు 11 వేల మంది - Sakshi

ఈసెట్‌కు 11 వేల మంది

    నేడే పరీక్ష.. నగరంలో రెండు జోన్లు..14 కేంద్రాలు
     నిమిషం లేటైనా అనుమతించం: కన్వీనర్ సాయిబాబు

 
సాక్షి, సిటీబ్యూరో: ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2014కు నగరంలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం జరిగే ఈ పరీక్షకు 11,687 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసిన వారు ఈసెట్‌లో ర్యాంకు సాధించి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. ఉన్నత విద్యామండలి తరపున ఈ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహణకు నగరాన్ని రెండు (హైదరాబాద్ 1,2)జోన్లుగా విభజించారు.

హైదరాబాద్-1 జోన్‌లోని 3 కేంద్రాల్లో 6,155 మంది, జోన్-2లోని 11 కేంద్రాల్లో 5,532 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పరీక్ష జరుగుతుంది. జోన్-1 కోఆర్డినేటర్‌గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య, జోన్-2 కోఆర్డినేటర్‌గా ఓయూ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గోపాల్‌నాయక్ వ్యవహరిస్తారు.
 
నిమిషం లేటైనా అనుమతించం

ఈసెట్‌కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించబోమని కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట కంటే ముందు అభ్యర్థులను పరీ క్ష హాలు నుంచి బయటకు పంపబోమన్నారు. 9.15 గంటల నుంచే పరీక్ష కేం ద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు.

అభ్యర్థులు ఫొటో అతికించిన ఆన్‌లైన్ దరఖాస్తు కాపీ, హాల్‌టికెట్‌తో పాటు నీలి, నలుపు రంగు బాల్‌పాయింట్ పె న్నులు తెచ్చుకోవాలి. కాలుక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, తెల్లకాగితాలు వంటివి అనుమతించరు. ఓఎంఆర్ షీట్లో సమాధానాలను ఒక సారి గుర్తించాక వాటిని మార్చేందుకు వీల్లేదు. వాటిని చెరిపేందుకు ఎరైజర్, వైట్‌నర్లు వాడరాదని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement