స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ (కో-ఎడ్) కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
జోగిపేట: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ (కో-ఎడ్) కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోగా జోగిపేటలోని కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ కళాశాలలోనే దరఖాస్తు ఫారాలు పొందాలన్నారు.
పాలీసెట్-2016 ర్యాంకు కార్డు, పదోతరగతి మెమో, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ జత చేసి కళాశాలలో అందజేయాలన్నారు. స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందిన అభ్యర్థులు తాము జత చేసిన సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజును కళాశాలలో చెల్లించి అడ్మిషన్లు పొందాలని సూచించారు.