వెబ్‌సైట్‌లో గతేడాది వివరాలు పొందుపరిచిన ఐఐటీ బాంబే
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏ ర్యాంకు వారికి ఎక్కడ సీటు వస్తుంది. ఏ బ్రాంచీల సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైన కాలేజీ, కోరుకున్న బ్రాంచిలో సీటు వస్తుందా? లేదా? వంటి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఐఐటీ బాంబే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 2013, 2014 సంవత్సరాల్లోని విద్యార్థుల ర్యాంకు, వారు పొందిన బ్రాంచి సీటు తదితర వివరాలను తమ వెబ్‌సైట్‌లో (http://jeeadv.iitb.ac.in/seat information) పొందుపరిచింది. విద్యార్థులు వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రత్యేక లింక్‌ను ఉపయోగించుకొని తమ ర్యాంకులతో ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చని (కచ్చితంగా అలాగే ఉండకపోవచ్చు కూడా) వెల్లడించింది.
ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు?
Published Fri, Jun 19 2015 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement