టాలీవుడ్‌లో మోస్ట్ అవైటేడ్‌ చిత్రాలివే.. మొదటిస్థానంలో ఆ సినిమానే! | Here's The List Of Most Awaited Tollywood Films As On Aug 15th 2024 By Ormax Media, Tweet Inside | Sakshi
Sakshi News home page

Most Awaited Tollywood films: మోస్ట్ అవైటేడ్‌ సినిమాల్లో టాప్‌లో దేవర.. పుష్ప-2 ఎక్కడంటే?

Published Wed, Aug 21 2024 7:27 PM | Last Updated on Wed, Aug 21 2024 7:50 PM

Most Awaited Tollywood films as on Aug 15th 2024

టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ దేవర, బన్నీ మూవీ పుష్ప-2 ది రూల్ ముందువరసలో ఉన్నాయి. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడంతో అందరి చూపు దేవరపైనే ఉంది. దీంతో ఈ ఏడాదిలో అందరి దృష్టి ఈ రెండు సినిమాలపైనే ఉంది. ఆ తర్వాత ప్రభాస్ స్పిరిట్‌, పవన్ కల్యాణ్ ఓజీ, జై హనుమాన్ తర్వాత వరుసలో ఉన్నాయి.

టాలీవుడ్‌లో మోస్ట్‌  అవేటైడ్ చిత్రాల జాబితాను ప్రముఖ ఆర్మాక్స్‌ మీడియా వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన లిస్ట్‌లో పుష్ప-2 అధిగమించి దేవర ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఇది కేవలం ఆగస్టు 15 వరకు సేకరించిన డేటా మాత్రమేనని తెలిపింది. అంతేకాకుండా అక్టోబర్‌ నుంచి రిలీజ్ కాబోయే చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మరీ మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్‌ రూపంలో చెప్పేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement