బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్‌.. మూడు వారాల్లో మరో రికార్డ్ | Allu Arjun Pushpa 2 The Rule Collections In Just 21 Days | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఈ ఏడాది పుష్పరాజ్‌దే!

Published Thu, Dec 26 2024 4:26 PM | Last Updated on Thu, Dec 26 2024 5:01 PM

Allu Arjun Pushpa 2 The Rule Collections In Just 21 Days

అల్లు అర్జున్‌ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.

తాజాగా పుష్ప-2 వసూళ్లపై నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని పోస్టర్‌ రిలీజ్ చేసింది. అంతేకాకుండా 2024లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన మూవీగా ఘనత సాధించింది.  తొలి రోజే రూ.294 కోట్లతో ప్రభంజనం సృష్టించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement