
Rahul Vaidya Disha Parmar Wedding: హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, సింగర్, రాహుల్, దిశా పార్మర్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే కదా! జూలై 16న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లో కొత్త పెళ్లికూతురు దిశా మెరిసిపోయింది. ఈ మేరకు నెట్టింట మెహందీ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో అమ్మాయిలందరూ నటి కాళ్లు, చేతులను మెహందీతో నింపేస్తుండగా కొత్త పెళ్లికూతురు తెగ సిగ్గుపడుతోంది. మరోవైపు అక్కడే ఉన్న ఆమె స్నేహితులిద్దరరూ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ వేడుకను హుషారెత్తిస్తున్నారు. ఇక మరో వీడియోలో సింగర్ రాహుల్ తన ప్రేయసి కోసం పాట పాడి అక్కడున్న అందరినీ ఫిదా చేశాడు.
కాగా రాహుల్ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో దిశా హౌస్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో దిశా బర్త్‌డే రోజు రాహుల్ తన మనసులోని ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. అంతేకాకుండా మ్యారీ మీ? (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని రాసి ఉన్న టీషర్ట్‌ను సైతం ధరించాడు.
అతడి ప్రపోజల్‌తో తొలుత షాకైన దిశా ఆ వెంటనే తేరుకుని పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది. బిగ్‌బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ బయట షికార్లకు వెళుతూ, వీడియోలు చేస్తూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలో గతవారమే తమ పెళ్లితేదీని ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిందీ జంట. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment