Singer Kanika Kapoor Second Marriage With Businessman, Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Kanika Kapoor Second Marriage: రెండో పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి

Published Sat, May 21 2022 8:57 AM | Last Updated on Sat, May 21 2022 9:49 AM

Kanika Kapoor Ties Knot With Businessman, Photos Went Viral - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ కనికా కపూర్‌ పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని పెళ్లాడింది. శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లికి హాజరైన సింగర్‌ మన్మీత్‌ సింగ్‌ నూతన వధూవరులతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మీరెంత అందంగా ఉన్నారో మీరు కలిసి సాగించే జర్నీ కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా కనికాకు ఇంతకుముందే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని లండన్‌కు వెళ్లిపోయింది. ఆమెకు ఆయనా, సమర, యువరాజ్‌ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి దంపతుల మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసుకుంటోంది. లక్నోలో పెరిగిన ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కు వస్తూ ఉంటుంది. కాగా కనికా.. బేబీ డాల్‌, చిట్టియక్కలాయాన్‌, టుకుర్‌ టుకుర్‌, జెండా ఫూల్‌ పాటలతో జనాలను ఉర్రూతలూగించింది. ఇటీవల పుష్ప మూవీలో ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో అలరించింది.

చదవండి 👉🏾 ఒక మ్యూజిక్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేసి ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నా

 మోహన్‌ లాల్‌ '12th మ్యాన్‌' రివ్యూ.. ఎలా ఉందంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement