బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.
కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.
కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్‌లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment