
సాక్షి,బెంగళూరు: శ్రవణ బెళగోళలో ఉన్న దిగంబర బాహుబలి విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలంటూ ప్రభు పాత్రికేయుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కన్నడ సంస్కృతికశాఖ మంత్రి ఉమాశ్రీకు బుధవారం లేఖ రాశారు. సాంకేతికంగా, సామజిక మార్పుల పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో తొమ్మిదవ శతాబ్దంలో దిగంబరుడిగా ఉన్నారనే కారణంగా నేటికి కూడా బాహుబలిని దిగంబరుడిగానే ఉంచడం సమంజపం కాదంటూ లేఖలో విన్నవించారు.
అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయం అప్పటికి సరైనదేనైనా ప్రస్తుత కాలానికి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనివల్ల ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో మూఢనమ్మకాలు మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా దిగంబరుడిగా ఉన్న బాహుబలి విగ్రహాన్ని చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలని లేఖలో విన్నవించారు.