ఓటమికి నాదే బాధ్యత | Iam the responsible for the defeat sayes Cm siddaramaiah | Sakshi
Sakshi News home page

ఓటమికి నాదే బాధ్యత

Published Wed, Aug 26 2015 4:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఓటమికి నాదే బాధ్యత - Sakshi

ఓటమికి నాదే బాధ్యత

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
 
 సాక్షి, బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బీబీఎంపీ ఎన్నికల్లో తాము అనుకున్న విధంగా విజయాన్ని పొందలేక పోయామని, అయితే ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాబోదని అన్నారు. బీబీఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీబీఎంపీ ఎన్నికల్లో తాము రూపొందించిన మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్‌లు తమకు విజయాన్ని చేకూరుస్తాయని ఆశించామని, అయితే తమ ఆశలు ఆవిరయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ప్రజల తీర్పుకు తలొంచక తప్పదని, అందుకే ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని చెప్పారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనంత మాత్రాన ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించారనడం సరికాదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement