
నటుడు ప్రకాష్ రాజ్
సాక్షి, యశవంతపుర: బాహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూర్‌లో జరిగిన ప్రధాని మోదీ ర్యాలీపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఏదోక విషయంపై స్పందిస్తూనే ఉంటారు. ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సాహితీవేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిసిన వారు కలిశారు. ఆ సమయంలో అతినికి రాజ్యసభ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రయోజనం కలుగుతుందన్నారు. వామపక్షాల పోరాటంలో ముందజలో ఉన్న ప్రకాశ్‌కు టికెట్ ఇస్తే కాంగ్రెస్‌కు కలిగే లాభాలపై సీఎంతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఏఐసీసీ వద్ద కూడా ఈ ప్రస్థావన తెచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment