శశికళకు కిత్తూరు రాణి చెన్నమ్మ రాష్ట్ర అవార్డు | Shashikala got the Kitturu rani cennamma award | Sakshi
Sakshi News home page

శశికళకు కిత్తూరు రాణి చెన్నమ్మ రాష్ట్ర అవార్డు

Published Wed, Mar 8 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

Shashikala got the Kitturu rani cennamma award

బళ్లారి : నగరానికి చెందిన ప్రగతి సమాజ సేవా సంఘం అధ్యక్షురాలు, మాజీ ఉప మేయర్‌ శశికళ కృష్ణమోహన్‌కు కిత్తూరు రాణి చెన్నమ్మ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు అవార్డులను ప్రదానం చేశారు. బెంగళూరులోని రవీంద్ర కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా శశికళ కిత్తూరు రాణి చెన్నమ్మ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉమాశ్రీ, కేకే జార్జ్, ఎమ్మెల్సీ వీఎస్‌ ఉగ్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఆమెకు అవార్డు లభించడంపై నగరంలోని పలువురు అభిమానులు, మద్దతుదారులు అభినందనలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement