
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ (నిలిచిపోయిన వాహనాల రాకపోకలు)
కృష్ణరాజపురం :
ట్రాఫిక్ జంజాటంతో సామాన్యులు మాత్రమే బాధితులవుతుండగా బుధవారం మొదటిసారి సీఎం సిద్ధరామయ్య కూడా ఇక్కట్ల పాలయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి సీఎం సిద్ధరామయ్య బుధవారం నగరంలో పర్యటించారు.
ఈ క్రమంలో కె.ఆర్.పురం పరిధిలోని రామ్మూర్తినగర్‌లో పర్యటించడానికి వెళుతుండగా అదే సమయంలో అటుగా వెళుతున్న బీఎంటీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తి మొరాయించింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే మార్గంలో వెళుతున్న సీఎం సిద్ధరామయ్య కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. బీఎంటీసీ అధికారులు హూటాహుటీన బస్సుకు మరమ్మత్తులు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.