సీఎంపై వెంకయ్య నాయుడు ఫైర్ | selective memory loss is dangerous, says venkaiah on siddaramaiah | Sakshi
Sakshi News home page

సీఎంపై వెంకయ్య నాయుడు ఫైర్

Published Thu, Aug 27 2015 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

సీఎంపై వెంకయ్య నాయుడు ఫైర్

సీఎంపై వెంకయ్య నాయుడు ఫైర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కావాలనే కొన్ని విషయాలను మర్చిపోతున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కావాలనే కొన్ని విషయాలను మర్చిపోతున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. మహాదాయి నది విషయంలో ఆయన ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని అన్నారు. గోవాతో తమకున్న ఈ సమస్యను ప్రధాని నరేంద్రమోదీ పరిష్కరించలేదని అంటున్నారని, సోనియా గాంధీ ఈ విషయంలో 2007 మే 30వ తేదీన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు. మహాదాయి నదీ జలాలను కర్ణాటకకు మళ్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని ఆమె చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు.

ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, తమ అధినేత్రి అప్పట్లో ఏం చెప్పారో సిద్దరామయ్యకు కూడా తెలుసని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అదేమీ గుర్తులేనట్లు నటిస్తున్నారన్నారు. కావాలంటే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రధానమంత్రి సాయం కావాలని కోరడంలో తప్పులేదు గానీ, సోనియా ఏం చెప్పారో మర్చిపోయి ఇప్పుడు ప్రధానమంత్రిని నిందించడం సరికాదన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లకు జ్ఞాపకశక్తి బాగుండాలని, కావాలని మర్చిపోవడం చాలా ప్రమాదకరమని వెంకయ్య నాయుడు మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement