మైసూరు: ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, ప్రజల సేవ కొనసాగిస్తానన్నారు. శనివారం ఆయన మైసూరు, వరుణలో పర్యటించారు. బిళిగెరె గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానన్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పారు. ప్రజలు బీజేపీని ఓడించి చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు.
జూలైలో 3 గ్యారంటీలు
మైసూరు జిల్లాలో గ్యారంటీ పథకాలైన అన్నభాగ్య, బెళగావిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. సుత్తూరు దేశికేంద్రస్వామిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూలై 1న కలబురిగిలో గృహజ్యోతి, అదేరోజు పది కేజీల బియ్యాన్ని ఇచ్చే అన్నభాగ్యను మైసూరులో, అలాగే జూలై 16లో బెళగవిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 2022–23లో ఉత్తీర్ణులైన డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు 24 నెలల్లో పని లభించకపోతే నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. ఎస్‌ఐ నియామకాల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment