శివాజీనగర: పార్టీ ఎమ్మెల్యేలతో రెండో రోజూ మంగళవారం కూడా సీఎం సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఉదయం సీఎం నివాసం కృష్ణాలో రాయచూరు, విజయపుర, కొప్పళ జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల, ఎమ్మెల్యేలతో సమావేశం జరిపారు. సోమవారం తుమకూరు, యాదగిరి, చిత్రదుర్గ, బాగలకోట, ధారవాడ జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించారు.
మంగళవారం సమావేశంలో పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకంగా మీడియా ముందు అధికారిక వ్యాఖ్యలు చేయరాదని, నియోజకవర్గ నిధులతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ఇంతకు ముందు బదిలీల విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
ఈ విషయంపై సీఎల్‌పీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపి, అసంతృప్తిని పక్కకుపెట్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కల్యాణ కర్ణాటక ఎమ్మెల్యేలు చేసిన విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి అధిక నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment