
సాక్షి, బెంగళూరు: అనాలోచితంగా పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఒక అసమర్థుడు అని... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించడానికని నోట్లను రద్దు చేసిన ప్రధాని ఇప్పటివరకు ఎంత నల్లధనాన్ని నిర్మూలించారో, ఎంత వెలికి తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులకు ఎటువంటి నష్టం, కష్టం వాటిల్లలేదని ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయం వల్ల కేవలం పేదలు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం రూ.28వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసులో, విధానసభలో నివేదికలు అందించడానికి ముందే తాము చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఉపేంద్ర పార్టీపై స్పందన..
నటుడు ఉపేంద్ర స్థాపించిన కొత్త పార్టీ కేపీజేపీపై స్పందిస్తూ.. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని అందుకు ఉపేంద్ర మినహాయింపేమి కాదన్నారు. కార్యక్రమంలో మంత్రి జార్జ్,కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment