
సీఎం పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా..
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచిన వ్యక్తిని బెంగళూరు సైబర్‌క్రైం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండ్యకు చెందిన మధుసూదన్ చాలా కాలం నుంచి బెంగళూరుకు వచ్చి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను సీఎంపై ద్వేషంతో 2016లో ట్విట్టర్ ఖాతా తెరిచి అందులో అవహేళనకరంగా పోస్టులు చేస్తున్నాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్న మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు.