fake twitter account
-
ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి
‘ఒరేయ్ సత్తిగా.. బయటికి రారా సచ్చినోడా’ అంటూ విక్రమార్కుడు సినిమాలో రవితేజతో కయ్యానికి కాలు దూవ్విన మహిళ గుర్తుదా..? ఆమే జయవాణి. ఆ ఒక్క సీన్‌తో జయవాణి నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘యమదొంగ’ మూవీలోనూ ఓ మంచి పాత్ర పోషించింది.ఇలా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి..ఇటీవల ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. మంచి పాత్రలు లభించకపోవడం వల్లే సినిమాల్లో నటించడం లేదని జయవాణి చెబుతోంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఫేస్బుక్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల ఆమె పేరుతో ట్విటర్ అకౌంట్ ఓపెన్ అయింది. దానికి వెరిఫైడ్ అకౌంట్ అని బ్లూటిక్ ఉండడంతో.. అందరూ ఇది జయవాణి అఫిషియల్ అకౌంటే అనుకున్నారు. చాలా మంది ఆమెను ఫాలో అయ్యారు కూడా. కొన్నాళ్ల వరకు సినిమా అప్డేట్స్ మాత్రమే ట్వీట్స్ చేసింది. తాజాగా ఆమె అకౌంట్ నుంచి అడల్ట్ కంటెంట్ వస్తోంది. నగ్న ఫోటోలు, అసభ్యకరమైన వీడియోలు ఆమె ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. (చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) తాజాగా తాను ‘శూర్పణఖ’అనే వెబ్ సిరీస్ చేస్తున్నానని, ఇదిలో ప్రీలుక్ అంటూ ఆమె నగ్న ఫోటోలను షేర్ చేశారు. అవి చూసి ఆమె ఫాలోవర్స్ షాకయ్యారు. ఇవన్నీ జయవాణి స్వయంగా చేస్తున్నారా?అని ఆశ్చర్యపోయారు. అయితే అసలు విషయం ఏంటంటే..అది ఫేక్ అకౌంట్. ఆమె పేరుతో ఎవరో ఈ ట్వీటర్ అకౌంట్‌ని ఓపెన్ చేసి ఇదంతా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జయవాణియే చెప్పింది. అసలు తనకు ట్వీటర్ అకౌంటే లేదని, తనపేరుతో ఎవరో అకౌంట్ ఓపెన్ చేసి ఇలాంటి అడల్ట్ కంటెంట్‌ని షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. చాలామంది ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా? అని అడుగుతున్నారు. నేను లేదని చెప్పాను. అయితే ఆ ట్వీట్స్ చూసే నన్ను అడుగుతున్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ అకౌంట్లో షేర్ చేసిన నగ్న ఫోటోలు నావి కావు. దయచేసి ఎవరు ఆ ట్వీట్స్‌ని నమ్మొద్దు. అది ఫేక్ అకౌంట్. ఇప్పటికైనా ఆ ట్వీట్స్ ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’అని ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హెచ్చరించారు. -
ఆ ట్విటర్ అకౌంట్‌ని తొలగించండి.. కమెడియన్ సెంథిల్ ఫిర్యాదు
తమిళసినిమా: సీనియర్ హాస్య నటుడు సెంథిల్ తన న్యాయవాదితో కలిసి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. ఎవరో తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించి వదంతులను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు ఆ నకిలీ ట్విటర్లో పేర్కొన్నారని తెలిపారు. తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా తన పేరుతో ప్రారంభించిన నకిలీ ట్విటర్ అకౌంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్! సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు -
నాకు ట్విటర్ అకౌంట్ లేదు: రియా లాయర్
ముంబై: తనకు ఎలాంటి ట్విటర్ ఖాతా లేదని నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనేష్ షిండే శనివారం వెల్లడించారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఓ నకిలీ సమచారం సతీష్ మనేష్ షిండే పేరుపై ట్విటర్లో వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని స్ఫస్టం చేశారు. ‘డియర్ ఫ్రెండ్స్.. ట్విటర్‌తో ఇటీవల నా పేరుపై వచ్చిన ఖాతా నాది కాదు. అది నకిలీ ఖాతా. దీనిని ఎవరో అభిమాని క్రియోట్ చేసి ఉంటారని భావిస్తున్నాను. దీని నుంచి వచ్చే నకిలీ సమాచారం, వార్తలకు నేను బాధ్యుడిని కాదు. త్వరలోనే దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని తెలిపారు. సుశాంత్ కేసులో రియా తరపున ఆయన కోర్టు వాదిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో నేర నిరూపణ కావడంతో రియాను ముంబై మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో రియాకు షాక్) ఈ క్రమంలో రియా బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించిన అనంతరం ఆమెను ముంబై హైకోర్టు తరలించవచ్చని షిండే శుక్రవారం తెలిపారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తాము హైకోర్టును సంప్రదించడంపై నిర్ణయం తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. డ్రగ్ కేసులో నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు రియాను ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తప్పుడుగా తనను ఈ కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొంది. ఎన్సీబీ అధికారులు ఈ కేసులో తనను ఇరికించేలా తనను బలవంతం చేసి ఒప్పించారని ఆరోపించింది. విచారణ సమయంలో తాను చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేసులో సెప్టంబర్ 8న అరెస్టు అయిన రియాను సెప్టెంబర్ 22 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపారు. (చదవండి: రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ) -
సీఎం పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా..
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచిన వ్యక్తిని బెంగళూరు సైబర్‌క్రైం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండ్యకు చెందిన మధుసూదన్ చాలా కాలం నుంచి బెంగళూరుకు వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను సీఎంపై ద్వేషంతో 2016లో ట్విట్టర్ ఖాతా తెరిచి అందులో అవహేళనకరంగా పోస్టులు చేస్తున్నాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం ఒక అపార్ట్మెంట్లో ఉన్న మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు.