Actress Jayavani Says She Does Not Have A Twitter Account Amid Her Fake Pics Controversy - Sakshi
Sakshi News home page

ఆ నగ్నఫోటోలు నావికావు.. ‘శూర్పణఖ’లో నేను నటించడం లేదు: జయవాణి

Published Thu, Jun 22 2023 11:09 AM | Last Updated on Thu, Jun 22 2023 11:46 AM

Actress Jayavani Says She Does Not Have A Twitter Account - Sakshi

‘ఒరేయ్ సత్తిగా.. బయటికి రారా సచ్చినోడా’ అంటూ విక్రమార్కుడు సినిమాలో రవితేజతో కయ్యానికి కాలు దూవ్విన మహిళ గుర్తుదా..? ఆమే జయవాణి. ఆ ఒక్క సీన్‌తో జయవాణి నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్‌-రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘యమదొంగ’ మూవీలోనూ ఓ మంచి పాత్ర పోషించింది.ఇలా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి..ఇటీవల ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది.

మంచి పాత్రలు లభించకపోవడం వల్లే సినిమాల్లో నటించడం లేదని జయవాణి చెబుతోంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఇటీవల ఆమె పేరుతో ట్విటర్‌ అకౌంట్‌  ఓపెన్‌ అయింది. దానికి వెరిఫైడ్‌ అకౌంట్‌ అని బ్లూటిక్‌ ఉండడంతో.. అందరూ ఇది జయవాణి అఫిషియల్‌ అకౌంటే అనుకున్నారు. చాలా మంది ఆమెను ఫాలో అయ్యారు కూడా. కొన్నాళ్ల వరకు సినిమా అప్‌డేట్స్‌ మాత్రమే ట్వీట్స్‌ చేసింది. తాజాగా ఆమె అకౌంట్‌ నుంచి అడల్ట్‌ కంటెంట్‌ వస్తోంది. నగ్న ఫోటోలు, అసభ్యకరమైన వీడియోలు ఆమె ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తున్నారు.

(చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్‌పిక్ మార్చేసిందిగా!)

తాజాగా తాను ‘శూర్పణఖ’అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నానని, ఇదిలో ప్రీలుక్‌ అంటూ ఆమె నగ్న ఫోటోలను షేర్‌ చేశారు.  అవి చూసి ఆమె ఫాలోవర్స్‌ షాకయ్యారు. ఇవన్నీ జయవాణి స్వయంగా చేస్తున్నారా?అని ఆశ్చర్యపోయారు. అయితే అసలు విషయం ఏంటంటే..అది ఫేక్‌ అకౌంట్‌. ఆమె పేరుతో ఎవరో ఈ ట్వీటర్‌ అకౌంట్‌ని ఓపెన్‌ చేసి ఇదంతా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జయవాణియే చెప్పింది.

అసలు తనకు ట్వీటర్‌ అకౌంటే లేదని, తనపేరుతో ఎవరో అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఇలాంటి అడల్ట్‌ కంటెంట్‌ని షేర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చాలామంది ‘శూర్పణఖ’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారా? అని అడుగుతున్నారు. నేను లేదని చెప్పాను. అయితే ఆ ట్వీట్స్‌ చూసే నన్ను అడుగుతున్నారని ఇప్పుడు  అర్థమైంది. ఆ అకౌంట్‌లో షేర్‌ చేసిన నగ్న ఫోటోలు నావి కావు. దయచేసి ఎవరు ఆ ట్వీట్స్‌ని నమ్మొద్దు. అది ఫేక్‌ అకౌంట్‌. ఇప్పటికైనా ఆ ట్వీట్స్‌ ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’అని ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంట​‍ర్వ్యూలో ఆమె హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement