రాష్ర్ట ముఖ్యమంత్రిగా దళితుడిని నియమించాలన్న నినాదంపై ఎక్కడా అనవసరంగా నోరు జారకూడదంటూ సీఎం ...
‘దళిత సీఎం’ నినాదంపై సిద్ధు, పరమేశ్వరకు దిగ్విజయ్ సింగ్ సూచన
బెంగళూరు : రాష్ర్ట ముఖ్యమంత్రిగా దళితుడిని నియమించాలన్న నినాదంపై ఎక్కడా అనవసరంగా నోరు జారకూడదంటూ సీఎం సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే పార్టీ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల కొందరు దళిత నేతలు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఈ అంశంపై సిద్ధు, పరమేశ్వర్ ఎవరికి తోచినట్లు వారు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ వారిద్దరిని దిగ్విజయ్‌సింగ్ గట్టిగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ అంశంపై ఎక్కడా నోరు మెదపరాదని ఆయన సూచించినట్లు తెలిసింది.