బెంగళూరు: కర్ణాటకలోని బీదర్‌లో గతవారం లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ బహిరంగ సభను నిర్వహించడం ఇటు పాలకపక్ష కాంగ్రెస్‌లోనూ అటు ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలోనూ గుండెల్లో గుబులు రేపింది. దాదాపు ఆరున్నర కోట్ల మంది జనాభా కలిగిన రాష్ట్రంలో లింగాయతీలు 12 నుంచి 19 శాతం వరకు ఉండడం, వచ్చే ఏడాది అంటే, 2018 మొదట్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరాగాల్సి ఉండడం అందుకు కారణం. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు.
ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన లింగాయత్‌లు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సంప్రదాయంగా ఓటువేస్తూ వస్తున్నారు. అందుకనే రాష్ట్రంలో వారి సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప సీఎం అయ్యారు. లింగాయత్‌లు తమకు వ్యతిరేకంగా ఐక్య వేదికపైకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవని పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలసుకోవాలంటే ముందు లింగాయత్‌లు అంత పెద్ద బíß రంగ సభను ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరిపోతుంది. తమను హిందువుల్లో భాగంగా చూడవద్దని, తమకో ప్రత్యేకమైన సంస్కతి, సంప్రదాయాలు ఉన్నందున తమను ఓ ప్రత్యేక మతంగా పరిగణించాలని లింగాయత్‌లు డిమాండ్ చేస్తున్నారు.
అందుకోసమే వారు భారీ బహిరంగ సభను నిర్వహించారు. వారిని ప్రత్యేక మతంగా పరిగణిస్తే మైనారిటీ మతం కింద ఇతర మైనారిటీలు, వెనకబడిన వర్గాలకు వర్తించే రిజర్వేషన్లన్నీ వారికి వర్తిస్తాయన్నది వారి విశ్వాసం కావచ్చు. కానీ వారు మాత్రం తమది ప్రత్యేక సంస్కతి, సంప్రదాయమనే ఎప్పుడు వాదిస్తారు. కొంత మంది చరిత్రకారులు చెబుతున్నట్లుగా వీరశైవులు, తాము ఒక్కటి కాదన్నది వారి వాదన. హిందూ దేవుళ్ల సమూహానికి మూల పురుషుడు శివుడు ఒక్కడేనన్నది వారి మూల సిద్ధాంతం. అందుకని వారు శివుడిని ఒక్కడినే పూజిస్తారు. మెడలో శివ లింగాన్ని ధరిస్తారు. ఉత్తర కర్ణాటకలోని కల్యాణలో 12వ శతాబ్దంలో నివసించిన బసవన్నను తమ కమ్యూనిటి వ్యవస్థాపకుడిగా లింగాయతులు భావిస్తారు. పౌరానిక పాత్రయిన రేణుకాచార్యతో తమ కమ్యూనిటీ అంకురించిందని వారు విశ్వసిస్తారు. ఎనిమదవ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిన ఓ భక్తి ఉద్యమంలో నుంచి లింగాయత్‌లు పుట్టుకొచ్చారు. బసవన్న హయాంలో ఈ ఉద్యమం ఉధతంగా సాగింది.
ఆధ్యాత్మికతకు కులం ఎప్పుడూ అడ్డుకాకూడదని బసవన్న బోధించిన కారణంగా తాము అన్ని కులాలను సమానంగానే చూస్తామని, తమకు తమ సంస్కతి, తమ మతమే ముఖ్యమని లింగాయత్ నేతులు చెబుతుంటారు. శివుడు సష్టించిన ఈ జగతిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికే వేదాలు వచ్చాయని బసవన్న వాదించారు కనక తాము వేదాలను వ్యతిరేకిస్తామని వారు చెబుతారు. వీర శైవులు వేద సంప్రదాయాలనే కాకుండా కొన్ని స్థానిక సంప్రదాయాలను కూడా వ్యతిరేకించారని చరిత్రకారుడు ఏకే రామానుజం ‘స్పీకింగ్ ఆఫ్ శివ’ అనే తన పుస్తకంలో చెప్పారు. స్థానిక సంస్కతిలో భాగమైన జంతు బలులను వారు వ్యతిరేకిస్తారు. వారు పూర్తి శాకాహారులు. అయితే లింగాయతులు, వీరశైవులు సమానార్థాలని, ఇరువురు ఒక్కటేనని రామానుజం అభిప్రాయపడ్డారు.
హిందూ మతంలో ముఖ్య దేవుడైన శివుడిని లింగాయత్‌లు పూజించడమే కాకుండా కర్మ, పునర్జన్మలుంటాయని విశ్వాసిస్తారు కనుక వారు హిందూ మతంలో భాగమేనని లింగాయత్‌లపై పలు పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు విలియం మాక్ కార్మ్యాక్ లాంటి వారు చెప్పారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా లింగాయత్‌లు హిందువుల్లో భాగమేనని పార్టీ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని మొన్నటి నుంచి చెబుతున్నారు. హిందువుల నుంచి లింగాయత్‌లు విడిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ కర్ణాటక నాయకులు చెబుతున్నారు. లింగాయత్‌లంతా మూకుమ్మడిగా తీర్మానంచేసి పట్టుకొస్తే వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్ నాయకులకు మాటిచ్చారు. ఇటీవలి వారి బహిరంగ సభకు 50 వేలకుపైగా జనం రావడమే ఆయన మాటకు కారణమైని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులకు దగ్గరగా ఉండే బౌద్ధులను మైనారిటీ మతంగా గుర్తిస్తున్పప్పుడు తమను గుర్తించడానికి అడ్డం ఏమిటని లింగాయత్ నేతలు వాదిస్తున్నారు.
లింగాయత్‌లంటే పార్టీల్లో గుబులు
Published Wed, Jul 26 2017 6:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
Advertisement
Advertisement