lingayat
-
Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్..
బెంగళూరు: ‘అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య లింగాయత్ సీఎంలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్ సమర్ధించారు. సిద్దరామయ్య కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైను ఉద్ధేశించి మాట్లాడారని.. అందరు లింగాయత్ సీఎంల గురించి కాదని పేర్కొన్నారు. బొమ్మై మాత్రమే అవినీతిపరుడని అన్నారని, లింగాయత్‌లు మొత్తం అవినీతిపరులని అనలేదని తెలిపారు. షెట్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా మంది లింగాయత్ నాయకులు బీజేపీని విడిచిపెట్టారని తెలిపారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అంటే ఆ ప్రాంత ప్రజలను తక్కువ చూడటమేనని.. ఇది బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు తెలివైన వారని, బీజేపీకి ఓటు వేయకుండా తగిన బుద్ది చెప్పాలని కోరారు. కాగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ ఆలోచిస్తుందంటూ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సిద్ధరామయ్య మాట్లాడుతూ..ఇప్పటికే లింగాయత్ ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆయనే మూలం’ అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య కూడా వివరణ ఇచ్చారు. తాను లింగాయత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదని, కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైని మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు. చదవండి: కేరళకు తొలి వందేభారత్.. ప్రారంభించిన ప్రధాని మోదీ కాగా బీజేపీ నేత అయిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినకాయ్ను బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ తరపున వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో హుబ్లీ-ధార్వాడ్-సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల వ్యవధిలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రముఖ లింగాయత్ లీడర్లలో శెట్టర్ రెండో సీనియర్ నేత. అతనికంటే ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం, లక్ష్మణ్ సవేదీ హస్తం గూటికి చేరారు. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే -
వలపు వలలో చిక్కి.. వేధింపులు భరించలేకే!
రామనగర(కర్ణాటక): జిల్లాలోని లింగాయత్ మఠాధిపతి ఆత్మహత్య ఉదంతంలో విస్మయానికి గురి చేసే కోణం ఒకటి వెలుగు చూసింది. హనీట్రాప్‌లో చిక్కుకుని ఆ బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. రామనగర జిల్లా కంచుగల్ బండ్ మఠానికి చెందిన బసవలింగ స్వామిజీ(45).. తన పూజా మందిరంలో కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతిగా తొలగించే యత్నాలు జరుగుతున్నాయని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోట్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుపై ఓ అంచనాకి వచ్చారు. అయితే.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఇది హనీట్రాప్ కోణంతో ముడిపడి ఉందని గుర్తించారు. ఓ మహిళ సాయంతో ఆయన్ని అసభ్య కోణంలో చిత్రీకరించి.. ఆ వీడియోల ద్వారా ఆయనపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు.. కానీ, ఆమె వల్లే ఇదంతా అంటూ ఆయన లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళతో ఆయన అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన మొత్తం నాలుగు వీడియోలను పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫోన్లోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ వీడియోలను రికార్డ్ చేసినట్లు ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ వీడియోల ద్వారా ఆయన్ని స్థానం నుంచి తప్పించాలనుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కన్నడనాట మఠాలపై, మఠాధిపతులపై రాజకీయ ప్రభావం ఉండడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కంచుగల్ బండ్ మఠానికి బసవలింగ స్వామిజీ.. తన 20వ ఏట(1997లో) మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి కూడా. -
కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య.. బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామనగర జిల్లా మగాడి తాలుకా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆశ్రమం ఆవరణంలోని పూజా గది కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే స్వామి 6 గంటల వరకు లేవకపోవడం, పూజ గది తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బసవలింగ స్వామి 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్ మఠానికి 1997లో ప్రధానపీఠాధిపతిగా నియామకయ్యారు. అప్పటి నుంచి (25 సంవత్సరాల పాటు) ఈ మఠానికి ఆయనే అధిపతిగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని సైతం జరుపుకున్నారు. స్వామిజీ వద్ద రెండు పేజీల సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్న వారి పేర్లు కూడా ఆ నోట్లో స్వామీజీ రాసినట్లు సమాచారం. అయితే బ్లాక్మెయిల్ కారణంగానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగారెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు రావడంతో స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. చదవండి: మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. -
లైంగిక ఆరోపణలు.. కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య!
బెలగావి: కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా.. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది. అయితే.. తాజాగా ఇద్దరు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది అక్కడ. అందులో లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంచలనం సృష్టించిన పోక్సో కేసు -
‘మేం ఓటర్లను ప్రభావితం చేయం’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం ప్రధానంగా తెరపైకి రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లింగాయత్‌ల ఓట్లకు గాలం వేస్తున్నాయి. లింగాయత్‌లలో మంచి పట్టున్న సిద్ధగంగ మఠానికి నేతల తాకిడి తీవ్రమైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే మఠాధిపతి శివకుమార స్వామిని కలిశారు. వీరశైవ లింగాయత్‌ల విశ్వాసాలను ప్రతిబింబించే సామాజిక కట్టుబాట్లను అనుసరించే ఆథ్యాత్మిక, మత గురువుగా 11 ఏళ్ల శివకుమార స్వామికి లింగాయత్‌లలో మంచి పేరుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలంతా సిద్ధగంగ మఠం బాట పట్టారు. సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కట్టబెట్టి వారిని ప్రసన్నం చేసుకోవడంలో ముందుండగా, బీజేపీ అదే వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో లింగాయత్‌ల ఓట్లు తమకేనన్న ధీమాలో ఉంది. మరోవైపు తాము ఓటర్లను ప్రభావితం చేయబోమని, రాజకీయ నేతల భవిష్యత్ కార్యక్రమాలు ఫలించాలని వారిని మఠం దీవించడం వరకే పరిమితమవుతుందని సిద్ధగంగ మఠం జూనియర్ స్వామీజీ సిద్ధలింగ స్వామి స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో మఠాలు ఎందుకు కీలకంగా మారతాయన్న ప్రశ్నలకు ఆయన బదులిస్తూ తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, మత.ఆథ్యాత్మిక పరంగా రాజకీయ నేతలకు మఠాలు ఆశీస్సులు అందిస్తాయని చెప్పుకొచ్చారు. తాము ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తామని, తాము ఎన్నడూ ఏ పార్టీ పక్షాన నిలవబోమని స్పష్టం చేశారు. దేశ పౌరులుగా తాము విధిగా ఓటు వేయాలని, ప్రజలు ముందుకొచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని మాత్రమే పిలుపు ఇస్తామని చెప్పారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని మఠాలు కోరబోవని..ప్రభుత్వాలు మాత్రం ఉదాత్త లక్ష్యంతో పనిచేసే మఠాలకు చేయూత ఇస్తున్నాయని అన్నారు. -
యెడ్డీ సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం ఇది!
సాక్షి, బెంగళూరు: కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశం కీలకంగా మారింది. ప్రతిపక్ష బీజేపీని ఇరకాటంలో నెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పిస్తూ.. కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తద్వారా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. కర్ణాటకలో లింగాయత్‌ల జనాభా 17శాతం ఉంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక సామాజికవర్గం కావడంతో కర్ణాటకలో లింగాయత్‌లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయి. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా పేరొందిన బీఎస్ యడ్యూరప్ప మరోసారి బీజేపీ గూటికి చేరడంతో ఆ వర్గం మరోసారి కమలదళానికి మద్దతుగా నిలుస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో లింగాయత్ ఓటు బ్యాంకును చీల్చడానికే సిద్దరామయ్య సర్కారు మత మైనారిటీ హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇది నిజానికి ఇప్పటి తాజా సమస్య కాదు. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ అంశంపై ఇప్పుడే తమ వైఖరి వెల్లడించబోమని, ఎన్నికల తర్వాతే తమ వైఖరిని స్పష్టం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. యడ్యూరప్ప సీఎం కాకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ‘ఇది యెడ్డీని సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం. లింగాయత్ ఓట్లను విభజించాలని సిద్దరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. ఆ సంగతి లింగాయత్‌లకు తెలుసు. ఎన్నికల తర్వాతే బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేస్తుంది’ అని అమిత్ షా శనివారం మీడియాతో తెలిపారు. -
కర్ణాటకలో హోరాహోరీ!
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా కన్నడ పీఠాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, తిరిగి చేజిక్కించుకోవాలని బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. కొన్ని నెలలుగా సీఎం సిద్దరామయ్య తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయాలు గెలుపు కలలు కంటున్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. అయితే 1985 నుంచీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోవడం రివాజుగా మారింది. ఆ ఆనవాయితీ ఇప్పుడూ కొనసాగుతుందని బీజేపీ ఆశతో ఉంది. అయినా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరచుగా కర్ణాటక పర్యటిస్తున్నారు. త్రిపురలో ఘనవిజయం సాధించిన బీజేపీ యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. లింగాయత్‌లపై కాంగ్రెస్..రైతులపై బీజేపీ బీజేపీకి గట్టి మద్దతుదారులైన లింగాయత్‌లలో చీలిక తెచ్చేందుకు వీరశైవ–లింగాయతుల ధర్మాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్కారు సిఫార్సును కేంద్రం ఆమోదిస్తేనే కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రయోజనం దక్కుతుంది. ఈ నిర్ణయం బీజేపీకి కూడా ఇబ్బందికరమే. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తే లింగాయత్‌లు అధికసంఖ్యలో నివసించే ఈశాన్య కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీకి విజయావకాశాలు తగ్గుతాయి. ఉచిత బియ్యం పథకంతోపాటు స్కూళ్లలో ఉచితంగా పాలు, గుడ్ల సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు వంటి పలు సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ అమలు చేస్తోంది. సహకార బ్యాంకుల రుణాల మాఫీతో పాటు తక్కువ ధరకు భోజనం, ఆహారపదార్థాల సరఫరా కోసం ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ తమకు కలసి వస్తాయనే నమ్మకంతోఉంది. కర్ణాటకలో 80 లక్షల మంది రైతులే ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయిస్తారని భావిస్తున్నారు. అందుకే తాము అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పాత మైసూరు ప్రాంతంలో పరిస్థితి కాంగ్రెస్, జేడీఎస్‌కు అనుకూలంగా ఉందని అంచనా. 2004 ఎన్నికల నాటి నుంచీ రాజధాని బెంగళూరు ప్రాంతం బీజేపీకి కంచుకోటలా మారింది. కోస్తాలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ నాటికి జనాదరణ పెరిగితే మెజార్టీ రాకున్నా అత్యధిక సీట్లు సాధించిన పెద్ద పార్టీగా బీజేపీ అవతరించవచ్చు. 25–35 సీట్లు సాధిస్తే జేడీ(ఎస్) ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది. సర్వేలు ఏం చెప్పాయంటే ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన మూడు సంస్థల ఎన్నికల సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఫిబ్రవరి 2న క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ వెల్లడించిన ఫలితాల్లో.. మొత్తం 224 సీట్లలో బీజేపీకి 113, కాంగ్రెస్‌కు 85, జేడీఎస్‌కు 25 స్థానాలు రావచ్చని జోస్యం చెప్పింది. కర్ణాటకలో బీజేపీకి సాధారణ మెజారిటీ లభిస్తే వచ్చే డిసెంబర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు జోరందుకున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వారు హిందువుల్లో భాగమే
మంగుళూరు: లింగాయత్‌లలో లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ఉన్నప్పటికీ అవి రెండూ హిందూమతంలో భాగమేనని పర్యాయ పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి అన్నారు. కర్ణాటకలోని ఉడిపిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ద్వైత, అద్వైత సిద్ధాంతాల వంటివేనని చెప్పారు. ద్వైత, అద్వైత సిద్ధాంతాల్లో ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ అవి రెండూ వైదిక మతంలో భాగమేనని అలాగే లింగాయత్, వీరశైవం రెండూ వేర్వేరు సంప్రదాయాలు అయినప్పటికీ అవి హిందూ మతం నుంచి భిన్నమైనవి కావన్నారు. కర్ణాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్న లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త బసవేశ్వరుని అనుసరిస్తుంటారు. లింగాయత్, వీరశైవ సంప్రదాయాలూ ఒకే మతానికి సంబంధించినవని ఇరువర్గాలూ అంగీకరిస్తే వీరశైవ–లింగాయత్ కమ్యూనిటీకి మరింత బలం చేకూరుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశం కాదని, ఈ అంశంపై ఇరు వర్గాలూ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
లింగాయత్లంటే పార్టీల్లో గుబులు
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్‌లో గతవారం లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ బహిరంగ సభను నిర్వహించడం ఇటు పాలకపక్ష కాంగ్రెస్‌లోనూ అటు ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలోనూ గుండెల్లో గుబులు రేపింది. దాదాపు ఆరున్నర కోట్ల మంది జనాభా కలిగిన రాష్ట్రంలో లింగాయతీలు 12 నుంచి 19 శాతం వరకు ఉండడం, వచ్చే ఏడాది అంటే, 2018 మొదట్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరాగాల్సి ఉండడం అందుకు కారణం. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన లింగాయత్‌లు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సంప్రదాయంగా ఓటువేస్తూ వస్తున్నారు. అందుకనే రాష్ట్రంలో వారి సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప సీఎం అయ్యారు. లింగాయత్‌లు తమకు వ్యతిరేకంగా ఐక్య వేదికపైకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవని పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలసుకోవాలంటే ముందు లింగాయత్‌లు అంత పెద్ద బíß రంగ సభను ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరిపోతుంది. తమను హిందువుల్లో భాగంగా చూడవద్దని, తమకో ప్రత్యేకమైన సంస్కతి, సంప్రదాయాలు ఉన్నందున తమను ఓ ప్రత్యేక మతంగా పరిగణించాలని లింగాయత్‌లు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే వారు భారీ బహిరంగ సభను నిర్వహించారు. వారిని ప్రత్యేక మతంగా పరిగణిస్తే మైనారిటీ మతం కింద ఇతర మైనారిటీలు, వెనకబడిన వర్గాలకు వర్తించే రిజర్వేషన్లన్నీ వారికి వర్తిస్తాయన్నది వారి విశ్వాసం కావచ్చు. కానీ వారు మాత్రం తమది ప్రత్యేక సంస్కతి, సంప్రదాయమనే ఎప్పుడు వాదిస్తారు. కొంత మంది చరిత్రకారులు చెబుతున్నట్లుగా వీరశైవులు, తాము ఒక్కటి కాదన్నది వారి వాదన. హిందూ దేవుళ్ల సమూహానికి మూల పురుషుడు శివుడు ఒక్కడేనన్నది వారి మూల సిద్ధాంతం. అందుకని వారు శివుడిని ఒక్కడినే పూజిస్తారు. మెడలో శివ లింగాన్ని ధరిస్తారు. ఉత్తర కర్ణాటకలోని కల్యాణలో 12వ శతాబ్దంలో నివసించిన బసవన్నను తమ కమ్యూనిటి వ్యవస్థాపకుడిగా లింగాయతులు భావిస్తారు. పౌరానిక పాత్రయిన రేణుకాచార్యతో తమ కమ్యూనిటీ అంకురించిందని వారు విశ్వసిస్తారు. ఎనిమదవ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిన ఓ భక్తి ఉద్యమంలో నుంచి లింగాయత్‌లు పుట్టుకొచ్చారు. బసవన్న హయాంలో ఈ ఉద్యమం ఉధతంగా సాగింది. ఆధ్యాత్మికతకు కులం ఎప్పుడూ అడ్డుకాకూడదని బసవన్న బోధించిన కారణంగా తాము అన్ని కులాలను సమానంగానే చూస్తామని, తమకు తమ సంస్కతి, తమ మతమే ముఖ్యమని లింగాయత్ నేతులు చెబుతుంటారు. శివుడు సష్టించిన ఈ జగతిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికే వేదాలు వచ్చాయని బసవన్న వాదించారు కనక తాము వేదాలను వ్యతిరేకిస్తామని వారు చెబుతారు. వీర శైవులు వేద సంప్రదాయాలనే కాకుండా కొన్ని స్థానిక సంప్రదాయాలను కూడా వ్యతిరేకించారని చరిత్రకారుడు ఏకే రామానుజం ‘స్పీకింగ్ ఆఫ్ శివ’ అనే తన పుస్తకంలో చెప్పారు. స్థానిక సంస్కతిలో భాగమైన జంతు బలులను వారు వ్యతిరేకిస్తారు. వారు పూర్తి శాకాహారులు. అయితే లింగాయతులు, వీరశైవులు సమానార్థాలని, ఇరువురు ఒక్కటేనని రామానుజం అభిప్రాయపడ్డారు. హిందూ మతంలో ముఖ్య దేవుడైన శివుడిని లింగాయత్‌లు పూజించడమే కాకుండా కర్మ, పునర్జన్మలుంటాయని విశ్వాసిస్తారు కనుక వారు హిందూ మతంలో భాగమేనని లింగాయత్‌లపై పలు పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు విలియం మాక్ కార్మ్యాక్ లాంటి వారు చెప్పారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా లింగాయత్‌లు హిందువుల్లో భాగమేనని పార్టీ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని మొన్నటి నుంచి చెబుతున్నారు. హిందువుల నుంచి లింగాయత్‌లు విడిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ కర్ణాటక నాయకులు చెబుతున్నారు. లింగాయత్లంతా మూకుమ్మడిగా తీర్మానంచేసి పట్టుకొస్తే వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్ నాయకులకు మాటిచ్చారు. ఇటీవలి వారి బహిరంగ సభకు 50 వేలకుపైగా జనం రావడమే ఆయన మాటకు కారణమైని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులకు దగ్గరగా ఉండే బౌద్ధులను మైనారిటీ మతంగా గుర్తిస్తున్పప్పుడు తమను గుర్తించడానికి అడ్డం ఏమిటని లింగాయత్ నేతలు వాదిస్తున్నారు.