సాక్షి, బనశంకరి(కర్ణాటక): మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో సిట్ సమర్థంగా దర్యాప్తు చేయడం లేదని బాధిత యువతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. జార్కిహొళిని సిట్ సక్రమంగా విచారించలేదు, రక్త పరీక్ష, తల వెంట్రుకల పరీక్షలు చేయలేదు, బీపీ, షుగర్ పరీక్షించి పంపారని ఆమె ఆరోపించింది. సిట్ చీఫ్ సౌమేందు ముఖర్జీ సెలవు పెట్టడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ కేసును సమర్థమైన çసంస్థతో విచారణ చేయించాలని ఆమె కోరింది. మరోవైపు యువతి తనకు తెలుసని, ఇద్దరి ఆమోదంతో గదిలో గడిపామని జార్కిహొళి ఇచ్చిన వాంగ్మూలం నివేదికను సిట్ హైకోర్టుకు అందజేసింది.
ఇద్దరికి ముందస్తు బెయిలు..
సీడీ కేసులో నిందితులు నరేశ్‌గౌడ, శ్రవణ్‌కు మంగళవారం నగర 91 వ సీసీహెచ్ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. వీరిపై జార్కిహొళి ఫిర్యాదు చేయడంతో అరెస్టు కోసం పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో బెయిలు పొందారు. మార్చి 2 వ తేది నుంచి పరారిలో ఉన్నారు.
చదవండి: మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ట్యూషన్ టీచర్.. ట్విస్ట్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment