
హనీ ట్రాప్ అని ఒత్తిడి వల్ల చెప్పాను, మళ్లీ విచారణ చేయాలని సిట్‌ను కోరినట్లు యువతి పేర్కొంది.
యశవంతపుర: కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల కేసులో తను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు బాధిత యువతి మంగళవారం తెలిపింది. సిట్ ముందు తాను ప్లేటు ఫిరాయించలేదని తెలిపింది. హనీ ట్రాప్ అని ఒత్తిడి వల్ల చెప్పాను, మళ్లీ విచారణ చేయాలని సిట్‌ను కోరినట్లు పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
ఇక బాధిత యువతి వీడియోను సిట్ విడుదల చేయడం తగదని ఆమె న్యాయవాది జగదీశ్ మంగళవారం అన్నారు. కావాలనే హనీ ట్రాప్ వంటి వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు. తద్వారా కోర్టుని, యువతిని మోసగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిట్ అధికారుల చేతులను ప్రభుత్వం కట్టేసిందని జగదీశ్ ఆరోపించారు.
చదవండి: రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి
రాసలీలల వీడియో.. ఆశా కార్యకర్త సస్పెన్షన్