
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అశ్లీల సీడీల వివాదం కారణంగా మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాజీనామా చేసిన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విలేకరి నరేశ్ గౌడ చెప్పారు. నరేశ్ అజ్ఞాతంలో ఉంటూ గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. పోలీసుల ఎదుట హాజరు కాలేనని, ఏడెనిమిది రోజుల తర్వాత అజ్ఞాతం వీడతానని వెల్లడించారు. తాను ఇప్పుడే బయటకు వస్తే తనను ఈ కేసులో ఇరికిస్తారని చెప్పారు.
సీడీ కేసుతో పాటు అందులో కనిపించిన యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పరిచయం ఉందని చెప్పాడు. ప్రైవేటు వార్తా సంస్థలో చాన్నాళ్లుగా పనిచేస్తూ ఎన్నో స్టింగ్ ఆపరేషన్లలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తాను విలేకరిని కావడంతో నాలుగైదు నెలల క్రితం బాధిత యువతి తనను కలిసిందన్నారు. మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి తనకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని కోరిందని నరేశ్ వెల్లడించారు. ఈ విషయమై దాదాపు 20 సార్లు ఆ యువతితో మాట్లాడానన్నారు. కేసులో తాను రూ. 5 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కనీసం రూ.5 తీసుకోలేదన్నారు.
చదవండి:
‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’
Comments
Please login to add a commentAdd a comment