సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతికి బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలింది. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న యువతిని భారీ పోలీసు బందోబస్తు మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్సకు వచ్చే రోగులు, ఆస్పత్రి అధికారులు, సిబ్బందికి తప్ప ఎవరినీ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. తరువాత విచారించేందుకు సిట్ ఆఫీసుకు తీసుకెళ్లారు.
విధానసౌధలో తొలి పరిచయం..
కొంతకాలం కిందట తొలిసారిగా విధానసౌధకు వెళ్లినప్పుడు మంత్రి రమేశ్ జార్కిహొళిని కలిసినట్లు యువతి చెప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో తన మొబైల్‌లో మల్లేశ్వరం పీజీ అని మంత్రి నంబరును సేవ్ చేయించారు. తనకు సహకరించాల్సిందిగా కోరారు. రెండు, మూడుసార్లు శారీరకంగా వాడుకున్నారు. మా ప్రాంతంలో బలమైన నేత కావడంతో ఏమీ చేయలేక మౌనం దాల్చాను అని ఆ యువతి సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఎప్పుడైనా సాక్ష్యాలుగా పనికొస్తాయని రమేశ్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను వీడియోలు తీసినట్లుపేర్కొంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదని, కానీ తన క్లాస్‌మేట్ శ్రవణ్‌కు చెప్పినట్లు తెలిపింది. ఆ వీడియోల సీడీలను అతనితో పాటు నరేశ్ అనే మరో స్నేహితునికి ఇచ్చినట్లు, మరో కాపీని తన రూంలో ఉంచినట్లు తెలిపింది.
చదవండి: (రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment