బెంగళూరు: రాసలీలల కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ఉన్న బాధిత యువతి సంచలన ఆరోపణలు చేసింది. ‘ఆ పని ఆయన ఒత్తిడి వల్లనే చేశాను’ అని బాధిత యువతి ఆరోపించారు. దీంతో కర్నాటకలో కలకలం రేపింది. ఆమె ఆరోపణలు చేసింది ఎవరిపైనే కాదు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్‌పై. ఆయన ఒత్తిడి మేరకు తమ కుమార్తె ఆ పని చేసిందని సోమవారం ఆ యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు.
రమేశ్ జర్కిహోలీని ఇరికించేందుకు శివకుమార్ కథ అంతా నడిపించాడని బాధిత యువతితో పాటు ఆమె ఇద్దరు సోదరులు, కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అలా చేస్తే కొంత ముట్టజెప్తామని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ ఆరోపణలతో బీజేపీ కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడింది. డీకే శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలు వచ్చిన తెల్లారి మంగళవారం డీకే శివకుమార్ స్పందించారు.
‘నేరం చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి వెనుక ప్రభుత్వం ఉందనే విషయం అందరికీ తెలసు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు’ అని శివకుమార్ మండిపడ్డారు. ‘ఈ పరిణామం జరిగినప్పటి నుంచి మీరు చూస్తునే ఉన్నారు. ప్రభుత్వం నిందితుడికి అండగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా. ఆ కేసుతో నాకేం సంబంధం లేదు. చూద్దాం. విచారణ జరుగుతోంది కదా!’ అని శివకుమార్ పేర్కొన్నారు. ‘నేను వారిపై ఒత్తిడి చేశా అంటున్నారు దానికి సాక్ష్యాలు బహిర్గతం చేయండి’ అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment