సాక్షి బెంగళూరు: కర్ణాటకలో వెలుగు చూసిన రాసలీలల సీడీ కేసు కొత్త మలుపు తీసుకుంది. తన ను ఉద్యోగం పేరుతో మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి లైంగికంగా వినియోగించుకున్నారని, ఆయ నపై తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధిత యువతి శుక్రవారం అజ్ఞాత స్థలం నుంచి ముచ్చటగా మూడోసారి మరో వీడియోను విడుద ల చేసింది. 24 రోజులుగా తనకు ప్రాణభయం ఉందని, కానీ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో తనకు ధైర్యం వచ్చిందని చెప్పింది.
కమిషనరేట్‌లో ఫిర్యాదు..
బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్ శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చి రమేశ్ జార్కిహోళిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత యువతి సొంత చేతిరాతతో రాసిన ఫిర్యాదు ప్రతిని పోలీసు కమిషనర్‌కు అందించినట్లు తెలిపారు. రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నారని యువతి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. వీడియో కాల్ ద్వారా అశ్లీలంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడని, ఉద్యోగం ఇప్పించకపోగా ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు..
అశ్లీల సీడీ కేసుకు సంబంధించి బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌లో రమేశ్ జార్కిహోళిపై ఐపీసీ 376సీ, 354ఏ, 504, 506, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని, రమేశ్ తమను హత్య చేసేందుకు వెదుకు లాట ప్రారంభించారని బాధితురాలు ఆ ఫిర్యాదు లో పేర్కొంది. ఫిర్యాదును బాధితురాలి తరపు న్యాయవాది తొలుత నగర పోలీసు కమిషనరేట్‌లో అందజేయగా దానిని కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని కమిషనర్ కమల్ పంత్ సూచించారు. దీంతో న్యాయవాది జగదీష్ కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందజేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో రమేశ్ జార్కిహోళికి అరెస్టు భయం పట్టుకుంది.
రేపటి నుంచి నా ఆట ప్రారంభం: రమేష్ జార్కిహోళి
‘రేపటి నుంచి నా ఆట ప్రారంభమవుతుంది. ఇది ఆమెకు చివరి అస్త్రం. ఇలాంటి పది ఫిర్యాదులు వచ్చినా ఎదుర్కొంటాను’ అని మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి తెలిపారు. యువతి ఫిర్యాదుపై బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్నే కూల్చానని, ఈ కేసు తనకు లెక్క కాదన్నారు. తాను కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే జైలుకు పోతానని, తానే స్వయంగా ఉరి వేసుకుంటానని, పోలీసు స్టేషన్‌కు వెళతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, ఇలా జరుగుతుందని మొదటి నుంచి తనకు తెలుసునని రమేశ్ జార్కిహోళి తెలిపారు.
వీడియోలో ఉన్నది నేను కాదు
సాక్షి బెంగళూరు: రాసలీలల సీడీ కేసు యువతి తన ఇంట్లో వారితో (తమ్ముడు) ఫోన్‌లో చేసిన సంభాషణగా చెబుతున్న ఒక ఆడియో విడుదలైంది. జార్కిహోళిపై బాధిత యువతి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఆడియో బయటకు రావడం విశేషం. 6.59 నిమిషాల నిడివి కలిగిన ఈ ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘వీడియో నిజం. కానీ అందులో ఉన్నది నేను కాదు. అదంతా గ్రాఫిక్స్, వాయిస్ మాడ్యులేషన్.. అన్ని క్లియర్ చేస్తాను. డీకే శివకుమార్ వారి వైపు కోసం ఎదురు చూస్తున్నాను. మీ మద్దతు లేకుంటే ఎలా.. తమ్ముడు.. నన్ను నమ్ము.. నేనెందుకు అలాంటి పని చేస్తాను. అందరూ నన్నే అనుమానిస్తున్నారు. వార్తల్లో చూపించేదంతా అబద్ధం. ఎవరో వాయిస్‌ను మాడ్యులేషన్ చేశారు. డీకే శివకుమార్‌కు సంబంధించిన వారు వస్తారు. మళ్లీ కాల్ చేస్తాను. అసలు వీడియో వారి వద్దే ఉంది. అమ్మ, నాన్నను నువ్వే హ్యాండిల్ చేయ్’’ అని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment